BigTV English

Grindavik : ఐస్‌లాండ్‌లో ఆ పట్టణం ఇక కనుమరుగే!

Grindavik : ఐస్‌లాండ్‌లో ఆ పట్టణం ఇక కనుమరుగే!
Grindavik

Grindavik : ఐస్‌లాండ్‌లోని గ్రింతావిక్ పట్టణం కనుమరుగు కానుంది. ఈ నెల 14న అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ఉవ్వెత్తున ఎగసిన లావా ఈ పట్టణాన్ని ముంచెత్తింది. ఫలితంగా పలు ఇళ్లు భస్మీపటలమయ్యాయి. ప్రస్తుతం లావా ప్రవాహం ఆగిపోయినా.. ఫిషర్స్(భూమి పగుళ్లు) కారణంగా ఈ టౌన్‌కు పెను ముప్పు పొంచి ఉంది. ఆ పగుళ్లే ఊరు ఊరంతంటినీ కుప్పకూలేలా చేయనున్నాయి. దీనిని క్రాక్ కొలాప్స్‌గా వ్యవహరిస్తున్నారు.


రేక్‌యానెస్ (Reykjanes) ద్వీపకల్పంలో నెల రోజుల వ్యవధిలోనే రెండో సారి అగ్నిపర్వతం బద్దలైంది. 2021 తర్వాత లెక్కిస్తే ఐదోసారి. డిసెంబరులో గ్రింతావిక్ కు 4 కిలోమీటర్ల దూరంలో విస్ఫోటనం జరగగా..ఈ నెలలో రెండోసారి బద్దలైన సమయంలో లావా ఏకంగా ఇళ్ల మధ్యలోకే ప్రవహించింది. 4 వేల మంది జనాభాను అంతకుముందే పట్టణం నుంచి తరలించారు.

యూరేషియన్, నార్త్అమెరికన్ టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులపై ఐస్‌లాండ్ ద్వీప దేశముంది. ఇవి దూరం జరగడం వల్ల ఏర్పడే పగుళ్ల నుంచి లావా ఉబికి వస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. పట్టణం ఉన్న ప్రాంతంలో అస్థిరత కారణంగా రోజుకు 8 మిల్లీమీటర్ల చొప్పున భూమి ఉబుకుతోందని చెప్పారు. జనవరి 14 విస్ఫోటనం తర్వాత ఇది మరింత వేగంతో జరుగుతోందని వివరించారు.


పట్టణంలోకి లావా ప్రవేశించకుండా రక్షణ గోడలు నిర్మించినా ప్రయోజనం లేకుండా పోయింది. 1000-1200 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉన్న లావా పలు భవనాలను ముంచెత్తింది. ఇంత వేడి లావా నిర్మాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. భూఉపరితలంలో పగుళ్ల కారణంగా ఈ పట్టణం ఎప్పుడైనా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.

అగ్నిపర్వతం బద్దలైన తర్వాత పౌరులు తొలిసారిగా ఆదివారం టౌన్‌లోకి తిరిగి ప్రవేశించారు. అయితే ముఖ్యమైన వస్తువులను తెచ్చుకునేందుకు మాత్రమే అధికారులు వారిని 3 గంటల పాటు అనుమతించారు.

Tags

Related News

Britain – China: అమెరికా వెళ్లాలంటే లక్ష డాలర్లు.. బ్రిటన్, చైనా కి మాత్రం ఫ్రీ ఫ్రీ ఫ్రీ

Pakistan Military: సొంత ప్రజలపైనే బాంబుల వర్షం కురిపించిన పాక్ జెట్స్.. 30 మందికి పైగా దుర్మరణం

US on H 1B Visa: హెచ్‌-1బీ వీసా రుసుంపై వైట్‌హౌస్‌ క్లారిటీ.. వారికి మాత్రమే, ఇక భయం లేదు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

Cyber ​​Attack: యూరప్ ఎయిర్‌పోర్టులపై సైబర్ అటాక్.. వేలాది మంది ప్రయాణికులపై ఎఫెక్ట్

US Flights Cancelled: అమెరికాలో నిలిచిపోయిన వందలాది విమానాలు.. కారణం ఇదే!

H-1B Visa: రూ. 88 లక్షలు చెల్లిస్తేనే H-1B వీసా.. ట్రంప్ నుంచి మరో షాకింగ్ నిర్ణయం

Trump H-1B Visa Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.. H1B వీసాలకు లక్ష డాలర్ల ఫీజు.. ఇండియ‌న్స్‌కి జాబ్స్ క‌ష్ట‌మే!!

Big Stories

×