Jagan Vs Ysrcp: ఏపీ రాజధాని అమరావతిపై జగన్ మాటలు ఆ పార్టీ డ్యామేజ్ అయ్యిందా? సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందా? పరిస్థితి గమనించిన నేతలు, సరిదిద్దేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారా? జగన్ మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
అమరావతి వ్యవహారం.. డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ కొత్త ప్లాన్
వైసీపీలో ఏ విషయంపై మాట్లాడినా జగన్ చెప్పేది ఫైనల్. ఆయన మాటకు అందరూ కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే మనసులోని మాటలను ఆయన బయటపెడతారు. ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోరు. ఒక్కోసారి సీనియర్ నేతలు సైతం సైలెంట్‌గా ఉండాల్సిందే. అధినేత ముందు ఏ ఒక్కరూ నోరు విప్పే సాహసం చేయరు.
గురువారం మధ్యాహ్నం రాజధాని అమరావతి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం జగన్. నది మధ్యలో షోకాల్డ్ నగరం రూపుదిద్దుకుంటోందని, దీనిపై సుప్రీంకోర్టు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఎకరాకు రెండు కోట్లు ఖర్చు అవుతోందని, ఇప్పటివరకు సేకరించిన భూమికి లక్ష కోట్లు అవుతుందన్నారు. నేషనల్ మీడియాలో జగన్ మాటలు విని ఆ పార్టీలు ఒక్కసారిగా షాకయ్యారు.
జగన్‌తో సజ్జల విభేదించారా? సాయిరెడ్డి బాటలో వెళ్తున్నారా?
ఈ వ్యవహారంలో జగన్‌పై సొంత నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇలాగైతే మాదారి మేం చూసుకుంటామని తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. దాదాపు 60 నియోజకవర్గాల్లో ఆ పార్టీ జీరో స్థాయికి పడిపోయినట్టు వార్తలు లేకపోలేదు. పరిస్థితి గమనించిన సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందు రంగ ప్రవేశం చేశారు.
ఆ వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు. జగన్ మాటలను మీడియా వక్రీకరించిందని తప్పించే ప్రయత్నం చేశారు. అసలు అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో జగన్ మాటలపై కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారాయన. అమరావతి విషయంలో జగన్ మాటలను మద్దతు పలికే ప్రయత్నం చేశారాయన. సజ్జల నిర్ణయాన్ని సగానికి పైగా ఆ పార్టీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.
ALSO READ: ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు.. 120 ఏళ్ల నాటి మండువా లోగిళ్లు
ఈ లెక్కన అమరావతి వ్యవహారంపై జగన్, సజ్జల డ్రామాలు ఆడినట్టు కనిపిస్తోందని కొందరు నేతల మాట. అమరావతి విషయంలో జగన్-సజ్జల మధ్య అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నట్లు చెబుతున్నారు. అమరావతిని అత్యంత నీచంగా ప్రస్తావించడం ఇదేం మొదటిసారి కాదు. కాంక్లేవ్‌లో కూడా ఇలాగే చెప్పారని గుర్తు చేస్తున్నారు. ఈ లెక్కన విజయసాయిరెడ్డి బాటలో సజ్జల పయనిస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఆ పార్టీలో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.