BigTV English

Janasena: విశాఖ సౌత్ బరిలో వంశీకృష్ణ శ్రీనివాస్ .. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన..

Janasena: విశాఖ సౌత్ బరిలో వంశీకృష్ణ శ్రీనివాస్ .. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన..

vamsi krisha srinivasa yadav


Vizag South Janasena Candidate: విశాఖ సౌత్ నియోజకవర్గ జనసేన అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పిఠాపురం పర్యటనలో ఉన్న జనసేనాని పార్టీ నేతలతో చర్చించిన తర్వాత వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పేరును ఖరారు చేశారు.

ఏపీలో టీడీపీ, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇంతకుముందు విడతలవారీగా 18 మంది అభ్యర్థులను జనసేనాని ప్రకటించారు. తాజాగా విశాఖ సౌత్ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడంతో 19 మంది అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. ఇంకా రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అవనిగడ్డ, పాలకొండ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. అక్కడ నుంచి ఎవరిని బరిలోకి దించనున్నారనే ఆసక్తి నెలకొంది.


మరోవైపు రెండు లోక్ సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలోకి దిగుతున్నారు. మచిలీపట్నం అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును ప్రకటించారు.

Also Read: వైసీపీ ఫ్యాన్‌కు సౌండ్ ఎక్కువ.. గాలి తక్కువ.. పవన్ కళ్యాణ్

జనసేన అసెంబ్లీ అభ్యర్థులు..
నెల్లిమర్ల – లోకం మాధవి
విశాఖ సౌత్ – వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
పెందుర్తి – పంచకర్ల రమేష్‌ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్‌ కుమార్‌
పిఠాపురం- పవన్‌ కల్యాణ్‌
కాకినాడ రూరల్‌ – పంతం నానాజీ
పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్‌

రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
నిడదవోలు – కందుల దుర్గేష్‌
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయకర్‌
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్‌
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు

తెనాలి – నాదెండ్ల మనోహర్‌
తిరుపతి – అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు – యనమల భాస్కరరావు

పెండింగ్ స్థానాలు..
అవనిగడ్డ
పాలకొండ

లోక్‌సభ అభ్యర్థులు..
కాకినాడ- తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌
మచిలీపట్నం- వల్లభనేని బాలశౌరి

Related News

CM Chandrababu: వరదలపై హై అలర్ట్.. సీఎం చంద్రబాబు డైరెక్ట్ ఆర్డర్స్.. అంతా అప్రమత్తం!

Bus accident: రాత్రి వేళ బస్సు బోల్తా… క్షణాల్లో కేకలు, అరుపులు.. ఎక్కడంటే?

Balakrishna warns: బాలకృష్ణ మాస్ వార్నింగ్… వేదికే కదిలిపోయింది!

Vijayawada beautification: విజయవాడకు కొత్త లుక్.. ఏపీ ప్రభుత్వం ప్లాన్ ఇదే!

Trolling On Jagan: కేంద్ర బలగాలతో ఎన్నికలు.. జగన్ ని కామెడీ పీస్ చేసేశారుగా?

Heavy rain alert: 48 గంటల పాటు దంచుడే.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!

Big Stories

×