Big Stories

Inspector Rishi Review: ఇన్స్పెక్టర్ రిషి.. ప్యాంట్ తడిసిపోతుంది మావా.. ఎక్కడ చూడాలంటే..?

- Advertisement -

Inspector Rishi Review:ఈ మధ్యకాలంలో హర్రర్ మరియు థ్రిల్లర్ సినిమాలు ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. పొలిమేర 2, పిండం, విరూపాక్ష, భ్రమ యుగం.. ఇలా ఇవన్నీ హారర్ కథాంశాలతో వచ్చి ప్రేక్షకులను విశేషంగా మెప్పించాయి. సినిమాలకు ధీటుగా ఓటిటీ సిరీస్ లు ఉండడం విశేషం. గతేడాది దూత సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అదే తరహాలో మరో సిరీస్ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తుంది. అదే ఇన్స్పెక్టర్ రిషి. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ హర్రర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఒక థ్రిల్ కు గురిచేస్తుంది. తెలుగు యంగ్ హీరో నవీన్ చంద్ర, సునైనా జంటగా.. నందిని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ మార్చి 29 న అన్ని భాషల్లో రిలీజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ సిరీస్ ఓటిటీలో టాప్ ట్రెండింగ్ లో ఉండడం విశేషం.

- Advertisement -

కథ: ఎప్పటినుంచో అడవులనురక్షించుకోవడం కోసం కొంతమంది తెగలు పోరాటాలు చేయడం, బలులు అర్పించడం చేస్తూనే ఉన్నారు. చిన్న చిన్న తెగల వారికి అడవే అమ్మ. అలాంటి అడవిని, అడవిలోని జంతువులును డబ్బు కోసం పోచర్స్, స్మగ్లర్స్ తో పాటు మోంటైజేషన్ కోసం ప్రభుత్వం.. తేన్ కాడ్ అడవిలో నివసించే ఒక తెగను బలవంతంగా ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తారు. ఇక అడవిని వదలలేని ఆ తెగ వారు.. వేరే గత్యంతరం లేక.. వనదేవత(వనరాచ్చి)కి పూజలు చేసి మాస్ సూసైడ్ చేసుకుంటారు. కట్ చేస్తే 20 ఏళ్ల తర్వాత ఆ అడవిలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అది కూడా మనిషికి హార్ట్ ఎటాక్ వచ్చేలా చేసి.. శరీరం చుట్టూ సాలీడు గూడులా కడుతూ ఉంటుంది. ఇక ఈ కేసును ఇన్స్పెక్టర్ రిషి నందన్ (నవీన్ చంద్ర) హ్యాండిల్ చేయడానికి వస్తాడు. ఇక రిషికి ఒక కన్ను కనిపించదు. అయినా కూడా ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈ హత్యలన్నీ వనరాచ్చి చేస్తుందని జనం చెప్తున్నా కూడా రిషి దాన్ని నమ్మకుండా దీనివెనుక మనుషులే ఉన్నారని బలంగా నమ్ముతాడు. అలా ఇన్వెస్టిగేషన్ లో ఎన్నో నిజాలు బయటపడతాయి. అసలు ఇన్స్పెక్టర్ రిషికి ఒక కన్ను ఎలా పోయింది.. ? అతని గతం ఏంటి.. ? నిజంగా ఈ హత్యలన్నీ వనరాచ్చి చేసిందా.. ? నిజంగా వనరాచ్చి ఉందా.. ? దీనివెనుక ఉన్న మనుషులు ఎవరు.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: అడవులను, జంతువులను రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఒకవేళ ఆ పని కనుక మనుషులు చేయలేదంటే.. అడవిదేవతనే వనాలను రక్షిస్తుంది అనేది ఈ సిరీస్ యొక్క కథగా తీసుకున్నారు. ఇప్పటివరకు ఇలాంటి కథలకు కొదువే లేదు. తమిళ్ లో వచ్చిన భూమిక కానీ, వరుణ్ ధావన్ నటించిన తోడేలు లాంటి సినిమాలు సైతం ఇలాంటి కథలే. కానీ, ఇన్స్పెక్టర్ రిషిలో చివరివరకు కథను రివీల్ చేయకుండా వనరాచ్చి ఎందుకు చంపుతుంది ..? అనే అనుమానం తోనే ఎపిసోడ్స్ చూసేలా చేయించింది డైరెక్టర్ నందిని. మధ్యమధ్యలో రిషికి దెయ్యం కనిపించడం, హీరోయిన్ తో ప్రేమ.. రొమాన్స్ ఇలాంటివి కూడా పెట్టడంతో పూర్తిగా దీన్ని హర్రర్ కథ అని కూడా అనలేం. సిరీస్ మొత్తం అడవిలోనే జరుగుతుండడం, పాత్రలు మొత్తం అడవికి సంబంధించినవారే కావడంతో చూసే మనకు కూడా అడవి గురించే తెలుసుకుంటున్నట్లు ఉంటుంది.

ఇక చివర్లో ట్విస్ట్.. బాగా థ్రిల్లర్స్ చూసేవారికి ముందే అర్ధమవుతుంది. హంతకుడు ఎవరు.. ? అనేది కనిపెట్టగలరు కానీ, ఎందుకు ఇదంతా చేస్తున్నాడు.. ? అనేది కనిపెట్టడం కొంచెం కష్టం. ఇక అలా కనిపెట్టకుండా చేయడంలో నందిని సఫలం అయ్యిందనే చెప్పాలి. పక్కా అడవి నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ కావడం, అందులోనూ రాత్రిపూట విజువల్స్ చూపించడంతో సాధారణంగానే భయం కలుగుతుంది. ఇక శవం చుట్టూ సాలెగూడు అల్లే పురుగుల గురించి చెప్పే సీన్ అయితే.. నిజంగా ఇలాంటి పురుగులు ఉంటాయా.. ? అనే ఆలోచన కచ్చితంగా వస్తుంది. ఇక అక్కడ అక్కడ సీన్స్ లాగ్ అయ్యాయి. అనవసరమైన సీన్స్ యాడ్ చేసి.. లెంత్ పెంచినట్లు అనిపిస్తుంది. 10 ఎపిసోడ్స్ చాలా ఎక్కువ.. అనవసరమైన సీన్స్ లేపేసి 8 ఎపిసోడ్స్ కుదిస్తే చూసేవారికి విసుగు రాకుండా ఉంటుందని చెప్పొచ్చు. ఇక సిరీస్ మొత్తం భయపెడుతుంది అని చెప్పలేం కానీ కొన్ని సీన్స్ లో ప్యాంట్ తడిసిపోతుంది. ఇక తెలుగులో కూడా తమిళ్ సాంగ్స్ రావడం కొంతవరకు అసహనానికి గురిచేస్తాయి. అక్కడక్కడ అర్ధం పర్థం లేని కనెక్షన్స్.. అసలు ఎందుకు వీరిని చూపిస్తున్నారో అర్ధం కానీ పరిస్థితి.

నటీనటులు: రిషి పాత్రలో నవీన్ చంద్ర ప్రాణం పెట్టేశాడు. ఇన్స్పెక్టర్ గా ఇన్వెస్టిగేషన్ చేసే విధానం, ప్రేమించిన అమ్మాయి దెయ్యంగా కనిపిస్తే.. ఒకపక్క భయపడుతూనే.. ఇంకోపక్క తనవలనే చనిపోయిందనే బాధను వ్యక్తం చేయడం.. చివరిలో నిజం తెలిసినప్పుడు కూడా హీరోయిన్ ను చూసే చూపు పర్ఫెక్ట్ పోలీసాఫీసర్ గా కనిపించాడు. ఇక రిషి తరువాత ఈ సిరీస్ లో ముఖ్యమైన పాత్ర అంటే.. శ్రీకృష్ణ దాయల్. రేంజ్ ఆఫీసర్ సత్య పాత్రలో ఒదిగిపోయాడు. సడెన్ గా చూస్తే ఆయనలో ఎస్ జె సూర్య పోలికలు కనిపిస్తాయి. అంతే నటన కూడా కనిపిస్తుంది. అడవిని, జంతువులను కాపాడుకోవడానికి అతను పడే కష్టం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. ఇక ఈ సిరీస్ లో చెప్పుకోవాల్సిన ఇంకో పాత్ర చిత్ర(మాలిని జీవరత్నం). ఒక అమ్మాయి.. ఇంకో అమ్మాయిని ప్రేమించడం.. వారిని సమాజం ఎలా చూస్తుందో తెలుసుకొని విడిపోవడం, తన ప్రేమను చంపుకొని.. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్లిపోతున్నా ఏడుస్తూ ఉండిపోవడం లాంటి సీన్స్ లో ఆమె ఎంతో అద్భుతంగా నటించింది. హీరోయిన్ సునైనా కనిపించేది కొద్దిసేపు అయినా.. ఉన్నంతసేపు పర్వాలేదనిపించింది. ఇక సినిమాకు హైలైట్ అంటే .. మ్యూజిక్. హార్రర్, థ్రిల్లర్ సినిమాలకు హైలైట్ గా నిలిచేది మ్యూజిక్కే. అస్వత్ ఈ సిరీస్ కు మంచి మ్యూజిక్ అందించాడు. వనరాచ్చి వచ్చే ప్రతిసారి ఒక శబ్దం రావడం, దానివెనుక మ్యూజిక్.. భయపెడుతూనే ఉంటుంది.

ట్యాగ్ లైన్: ఫైనల్ గా వీకెండ్ ఏం చూడాలో తెలియక.. ఒక హర్రర్, థ్రిల్లర్ సిరీస్ చూడాలి అనుకుంటే.. కొన్ని కొన్ని సీన్స్ ను స్కిప్ చేసి ఒకసారి ఈ సిరీస్ ను చూడొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News