BigTV English

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు జ్వరం.. ఊపిరితిత్తుల్లో నిమ్ము.. అయినా ఆగని సేనాని..

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌కు జ్వరం.. ఊపిరితిత్తుల్లో నిమ్ము.. అయినా ఆగని సేనాని..

Janasena chief Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత కొన్ని రోజులుగా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. తాజాగా ఆయన జ్వరంలో బాధపడుతున్నట్లు జనసేన ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.


ఇటీవలే పిఠాపురంలో వరుసగా రెండు రోజులు ఎన్నికల ప్రచారం చేసిన ఆయనకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో జనసేనాని వెంటనే హైదరాబాద్ కు వెళ్లి వైద్యం చేయించుకుని తిరిగి పిఠాపురం చేసుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై జనసేన ఓ కీలక విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం జనసేన అధినేత జ్వరంతో బాధ పడుతున్నారని జనసేన వెల్లడించింది. రికరెంట్ ఇన్ప్లుయంజు కారణంగా ఊపిరితిత్తుల్లో నిమ్ముజేరి రోజు ఏదో ఒక సమయంలో జ్వరంతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కారణంగా క్రేన్ గజమాలలు ఏర్పాటు చేయవద్దని అభిమాలకు జనసేన పార్టీ సూచించింది.


అదే విధంగా కరచాలనాలు, ఫోటోల కోసం ఒత్తిడి చేయవద్దని, పూలు జల్లినప్పుడు పవన్ కళ్యాణ్ ముఖం మీద పడకుండా జాగ్రత్తలు తీసుకోవ్సిందిగా జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు, అభిమానులకు విజ్ఞప్తి చేసింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నా సరే.. నేటి నుంచి ఆయన విజయభేరీ యాత్ర నిరాటంకంగా కొనసాగుతుందని తెలిపింది. కాగా, ఆయన ఈరోజు పిఠాపురంలో సమావేశం నిర్వహించారు.

Related News

Heavy rain: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు

Tomato- Onion Prices: భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధర.. రైతులు ఆవేదన..!

Gold Theft: కిలేడీలు.. పట్ట పగలే బంగారం షాపులో చోరీ

Machilipatnam Politics: మచిలీపట్నంలో జనసేన వర్సెస్ వైసీసీ, రంగంలోకి పోలీసులు

Tadipatri Political Tension: తాడిపత్రిలో హై టెన్షన్..పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేత ?

AP Women: ఏపీలో మహిళలకు శుభవార్త.. 2 లక్షల వరకు చేయూత, ఇంకెందుకు ఆలస్యం

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. జగన్ ఫ్యామిలీ మెడకు, భారతీ దగ్గర బంధువు సునీల్‌రెడ్డి?

CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు.. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు, మంత్రులతో భేటీ

Big Stories

×