Janasena on Duvvada Srinivas: పోసాని కృష్ణమురళితో దువ్వాడ శ్రీనివాస్ పోటీ పడవద్దని జనసేన నేతలు సూచిస్తున్నారు. ఇంతకు సీన్ లోకి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎందుకు వచ్చారనుకుంటున్నారా? ఇటీవల దువ్వాడ అసెంబ్లీ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నిజమెంత ఉందో కానీ, జనసేన నాయకులు మాత్రం దువ్వాడ పై ఫైర్ అవుతున్నారనే చెప్పవచ్చు. ఇంతకు దువ్వాడ ఏమన్నారు? జనసేన నేతలు ఏమన్నారో చూద్దాం.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం రోజు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సమయంలో పవన్ టార్గెట్ గా దువ్వాడ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. దువ్వాడ ఏమన్నారంటే.. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియడం లేదన్నారు. పవన్ నిద్రలో ఉన్నారని, ఎన్నికలకు ముందు ఎన్నో మాటలు చెప్పిన పవన్ ఎక్కడా అంటూ ప్రశ్నించారు. పవన్ అసెంబ్లీలో ఉన్నారుగా అంటూ మీడియా ప్రతినిధి చెప్పగా, లోపల ముసుగు వేసుకొని ఉన్నట్లు తాను చూశానన్నారు దువ్వాడ. అంతటితో ఆగక ప్రశ్నిస్తానన్న పవన్.. ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు రూ. 50 కోట్లు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణ చేశారు. ఇలా దువ్వాడ చేసిణ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మొదట ఈ కామెంట్స్ ను జనసేన అంతగా పట్టించుకోలేదని చెప్పవచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీను నోరు అదుపులో పెట్టుకోవాలని, రాజకీయ నేతలు ప్రజా సమస్యలపై మాట్లాడాలన్నారు. రీల్స్ చేసుకోవడం రాజకీయం కాదని, దువ్వాడకు రాజకీయ భిక్ష పెట్టింది పీఆర్పీ అన్నారు. పవన్ కల్యాణ్‌పైనే విమర్శలు చేస్తారా అంటూ ఎమ్మెల్యే స్పందించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతిలో మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస్ అలియాస్ శృంగారాల శ్రీనివాస్ అంటూ వ్యంగంగా విమర్శించారు. ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పాటులో పవన్ కళ్యాణ్ పాత్ర అభినందనీయమని దేశం అంతా కొనియాడుతోందన్నారు. కానీ దువ్వాడ శ్రీనివాస్ ఫేమస్ కావడం కోసమే ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దువ్వాడ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేకుంటే ప్రజాగ్రహం కళ్ల చూస్తావంటూ ప్రసాద్ అన్నారు.
జనసేన నగర అధ్యక్షులు రాజ రెడ్డి మాట్లాడుతూ.. అందరినీ వదిలి ప్రియురాలితో రీల్స్ చేసుకునే నీచుడు దువ్వాడ శ్రీనివాస్ అంటూ విమర్శించారు. సొంత జిల్లా వాళ్ళు తరిమికొడితే హైదరాబాద్ లో దువ్వాడ దాక్కున్నారని, ప్రజలు ఛీ కొట్టిన వ్యక్తికి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుజాత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అసత్య ఆరోపణలు చేశారన్నారు. యాభై కోట్లు తీసుకున్నట్లు దువ్వాడ నిరూపించకపోతే పళ్ళు రాలకొట్టి చేతిలో పెడుతామన్నారు.
Also Read: Posani Krishna Murali: తెలియదు.. గుర్తు లేదు.. మౌనం.. పోసాని విచారణ తీరు ఇదేనట?
చాక్లెట్ డే, కిస్ డే లు చేసుకునే నువ్వు సుద్దులు చెబితే ఎలా? దివ్వెల మాధురితో కులికే నువ్వు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు పలికారు. ఈ రీతిలో దువ్వాడ వర్సెస్ జనసేన మధ్య వార్ సాగుతోంది. కొందరు మాత్రం పోసానితో పోటీ పడవద్దని, కాస్త జాగ్రత్తగా విమర్శలు చేయాలని దువ్వాడకు సూచిస్తున్నారు. మరి ఈ కామెంట్స్ కు దువ్వాడ రిప్లై ఎలా ఉంటుందో వేచి చూడాలి.