Kayadu Lohar: సినీ పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ వస్తే చాలు.. తనను క్రష్ లిస్ట్‌లోకి యాడ్ చేసేస్తుంది కుర్రకారు. తెలుగులో అనే కాదు.. తమిళ, మలయాళం.. ఇలా ఏ భాషలో అయినా ఒక సినిమా విడుదలయ్యి అది అన్ని భాషల్లో హిట్ అయ్యిందంటే.. అందులో ఉన్న హీరోయిన్ గురించి యూత్ అంతా సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెడతారు. తాజాగా ‘డ్రాగన్’ అనే తమిళ మూవీ విడుదలయ్యింది. అది తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అయ్యింది. అందులో హీరోయిన్‌గా నటించిన కాయదు లోహర్ అనే అమ్మాయితో కుర్రకారు ప్రేమలో పడిపోయారు. తనపై తెలుగు యువత చూపిస్తున్న ప్రేమను దృష్టిలో పెట్టుకొని తాజాగా ఒక గుడ్ న్యూస్ షేర్ చేసింది కాయదు.
నార్త్ అమ్మాయి
కాయదు లోహర్ ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి. తను ముందుగా మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించినా కూడా రాని గుర్తింపు తనకు.. ‘డ్రాగన్’ మూవీ ద్వారా లభించింది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ఈ సినిమాతో అటు తమిళ, ఇటు తెలుగు.. రెండు భాషా ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా యూత్ అయితే తనను వెంటనే క్రష్ లిస్ట్‌లో కూడా యాడ్ చేశారు. అయితే తనకు తమిళ, తెలుగు భాషలు రాకపోయినా తనపై చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే సంతోషంగా ఉందంటూ తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది కాయదు లోహర్. దీంతో తన తెలుగు ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
టాలీవుడ్‌కు వస్తున్నా
‘‘నేను తెలుగు నేర్చుకుంటాను. మీ అందరి ప్రేమకు చాలా థ్యాంక్స్. మీరు నన్ను పెద్ద మనసుతో స్వాగతించారు. మీ ప్రేమ నాకు చాలా స్పెషల్. త్వరలో టాలీవుడ్‌లోకి వస్తున్నా’’ అంటూ అప్డేట్ ఇచ్చింది కాయదు లోహర్. అసలైతే తను ఇంతకు ముందే టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ‘అల్లూరి’లో కాయదు హీరోయిన్‌గా కనిపించింది. కానీ ఆ సినిమా అంతగా ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. అందుకే ఈ ముద్దుగుమ్మ గురించి కూడా అప్పుడు ప్రేక్షకులకు తెలియలేదు. మొత్తానికి అప్పుడు కాయదును గుర్తించనందుకు, తనకు ఇప్పుడు గుర్తింపు లభిస్తుందని తన ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీలవుతున్నారు.
Also Read: ‘కాయదు’ పేరుకు ఇంత చరిత్ర ఉందా.? ఈమె పెద్ద భక్తురాలే..
త్వరలో కలుద్దాం
‘‘అందరూ నా నటనను మెచ్చుకుంటున్నారు. స్క్రీన్‌పై నన్ను చూసి ఆదరిస్తున్నారు. అసలు ఇంతకంటే నాకు ఏం కావాలి. త్వరలోనే మళ్లీ థియేటర్లలో కలుద్దాం’’ అంటూ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది కాయదు లోహర్ (Kayadu Lohar). ‘డ్రాగన్’ విడుదలయ్యి తనకు ఫేమ్ వచ్చిన తర్వాత తన అప్‌కమింగ్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఫోకస్ పెరిగింది. ప్రస్తుతం కాయదు.. అథర్వ హీరోగా నటించిన ‘ఇదయం మురళి’ అనే చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే విడుదలకు సిద్ధమయ్యింది. అంతే కాకుండా ఇదే ఏడాదిలో బాలీవుడ్‌లో అడుగుపెట్టడానికి కూడా సన్నాహాలు మొదలుపెట్టింది కాయదు లోహర్.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">