Posani Krishna Murali: నాకు తెలియదు.. గుర్తు లేదు.. మర్చిపోయా.. ఇది పోసాని చెప్పిన సమాధానాలని టాక్. 5 గంటలుగా పోసానిని విచారిస్తున్న పోలీసులకు అదే సమాధానం వినిపిస్తుందట. దీనితో పోలీసులు మున్ముందు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో జనసేన నేత జోగిమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురళి పై కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా పోసానిని అన్నమయ్య పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ అరెస్ట్ అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. అయితే పోసాని విచారణలో చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న మాటలు కూడా అంతే సంచలనం సృష్టిస్తున్నాయి.
అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ అనంతరం పోసానిని ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ జిల్లా ఎస్పీ విద్యా సాగర్ అధ్వర్యంలో పోలీస్ అధికారులు విచారణ సాగిస్తున్నారు. మొదట మెడికల్ ఎగ్జామినేషన్ చేసిన అనంతరం పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ తర్వాత పోసాని భోజనం చేశారు. భోజనం అనంతరం తాను రెగ్యులర్ గా వేసుకునే టాబ్లెట్స్ పోసాని వేసుకున్నారు. ఆ తర్వాత విచారణ పర్వం మళ్లీ మొదలైందని తెలుస్తోంది. విచారణ లో పోసాని చెప్పిన అంశాలను పోలీసులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. కానీ పోలీసుల విచారణకు పోసాని ఏ మాత్రం సహకరించడం లేదని సమాచారం.
పవన్, లోకేష్, చంద్రబాబు లక్ష్యంగా చేసిన కామెంట్స్ పై పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. కానీ ఆ ప్రశ్నలకు తనకు తెలియదని, గుర్తు లేదని, కొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఈ సమాధానాలతో సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. లీగల్ ఒపీనియన్ కోసం పోలీస్ స్టేషన్ కు పబ్లిక్ ప్రసిక్యూటర్ రాగా, కేసులో తీసుకోవాల్సిన అంశాలపై చర్చ సాగిందట. పోసాని కేసులో కీలక ఆధారాలను పోలీసులు సేకరించారని, లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాలనే అంశాల పై లీగల్ ఒపీనియన్ తీసుకున్నట్లు కూడా ప్రచారంలో ఉంది. విచారణ అనంతరం నేరుగా రైల్వే కోడూరు జడ్జి నివాసానికి తీసుకువెళ్లి పోసానిని హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలుపుతున్నారు.
Also Read: Tirumala Update: మార్చినెలలో తిరుమల వెళ్తున్నారా? ఆ రోజుల్లో పలు సేవలు రద్దు..
ఇది ఇలా ఉంటే అన్నమయ్య కోర్టుకు మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేరుకున్నారు. పోసాని తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. భాదితుల పక్షాన వైసీపీ అండగా ఉంటుందని, అందుకే తాను వచ్చినట్లు తెలిపారు. కాగా న్యాయమూర్తి ముందు హాజరుపరచిన అనంతరం బెయిల్ వస్తుందా? రిమాండ్ కు తరలిస్తారా లేదా అన్నది తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద పోలీసులు ఈ కేసులో ఆచితూచి అడుగులు వేస్తున్నారని భావించవచ్చు. ఇప్పటికే గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న పోసానికి బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు వైసీపీ నేతలు అంటున్నారు.
4 గంటలుగా పోసానిని ప్రశ్నిస్తున్న జిల్లా ఎస్పీ, సీఐ
విచారణకు పోసాని సహకరించడంలేదంటున్న పోలీసులు
ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్న పోసాని
అన్నమయ్య కోర్టుకు హాజరైన మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి
సినీనటుడు పోసాని తరుపున బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న పొన్నవోలు pic.twitter.com/Vr1PqynvEP
— BIG TV Breaking News (@bigtvtelugu) February 27, 2025