Big Stories

Pawan Kalyan: పొత్తుల వెనుక పవన్ వ్యూహమేంటి ?

pawan kalyan
 
- Advertisement -

2014 ఎన్నికలు.. పవన్ కల్యాణ్‌ పోటీ చేయలేదు. తన మద్ధతును బీజేపీ, టీడీపీ కూటమికి ఇచ్చారు. 2019 ఎన్నికలు.. పవన్‌ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లారు. చాలా దారుణంగా దెబ్బతిన్నారు. 2024 ఎన్నికలు.. పవన్‌ టీడీపీ, బీజేపీ కూటమితో ముందుకెళ్తున్నారు. ఏం జరుగుతుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది. కానీ ఈ మధ్య జరిగిన ఘటనలే ఇప్పుడు ఇంట్రెస్టింగ్.. ఇప్పటి వరకు పవన్‌ను చాలా మంది సినిమా స్టార్‌గానే చూస్తున్నారు.

- Advertisement -

అదే ఇక్కడ సమస్య.. ఒక్కసారి 2019 ఎన్నికల టైమ్‌కు వెళ్దాం.. ఆ ఎన్నికల్లో అత్యంత దారుణంగా ఓడింది జనసేన.. ఒకే ఒక్క ఎమ్మెల్యేను గెలిపించుకోగలిగింది. అతను కూడా వైసీపీలో చేరాడు.. పవన్‌కు జ్ఞానోదయం అయ్యింది. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు అని. రెండు చోట్ల పోటీ చేస్తే.. రెండు చోట్ల ఓడిపోవడం ఆయనను బాగానే హర్ట్ చేసింది. వెంట పడి పరిగెత్తే ప్రతి అభిమాని ఓటు వేయడన్న విషయం తెలుసుకునే సరికి.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Also Read: కలియుగం.. కౌంటర్ ఎటాక్, అసలేం జరిగింది?

ఆ తర్వాత మొదలైంది అసలైన రాజకీయం.. ఇక ఫుల్‌ టైమ్‌ రాజకీయాల్లోనే ఉంటాను.. సినిమాలు బంద్ అని అనౌన్స్‌ చేసిన పవన్.. చెప్పిన మాటను గట్టున పెట్టి.. మళ్లీ సినిమాలు చేసుకున్నాడు..
ఉన్న నలుగురైదుగురు లీడర్లు పవన్‌పై తీవ్ర విమర్శలు చేసి వరి దారి వాళ్లు చూసుకున్నారు. తర్వాత ఏఏ నోటితో అయితే పాచిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ.. విమర్శలు చేశారో.. అదే నోటితో ప్రధాని మోడిని పొగిడి బీజేపీకి దగ్గరయ్యారు. దాపుగా పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కూడా రెడీ అయ్యారు. క్కడ ఎంట్రీ ఇచ్చింది వైసీపీ.. అన్న చిరంజీవిని, తమ్ముడు పవన్‌ను కలిపి విమర్శించింది. 009 ఎన్నికల్లో ప్రజారాజ్యం స్థాపించి 18 సీట్లు గెలిచిన పీఆర్పీని లాగైతే కాంగ్రెస్‌లో విలీనం చేసి చిరంజీవి కేంద్రమంత్రి పదవి తీసుకున్నారో మ్‌ అదే బాటలో పవన్‌ కూడా విలీనం చేసి పదవి కొట్టేస్తారు. ప్పుడు వైసీపీ నేతలు చేసిన విమర్శలు ఇవే. విమర్శలే పవన్‌లో పౌరుషాన్ని పెంచాయి. ర్టీని ఎలాగైనా నిలబెట్టాలన్న నిర్ణయానికి ఆజ్యం పోశాయి. లీన ఆలోచనను పక్కన పెట్టేలా చేశాయి.

పార్టీని నిలబెట్టాలి.. ఎన్నికల్లో పోటీ చేయాలి. ఆలోచనైతే ఉంది. కానీ ఆచరణ లేదు. తో సినిమాలు చేసుకుంటూ వెళ్లారు. దిరినప్పుడల్లా వచ్చి పోరాటాలు, విమర్శలు చేశారు. తో మరో నిక్‌ నేమ్ వచ్చి పడింది పవన్‌కు.. వీకెండ్ పొలిటిషియన్.. ఇది చేసింది ఎవరు.. మళ్లీ వైసీపీ నేతలే.. నిజానికి పవన్‌ డైవర్ట్ అయిన ప్రతిసారి తడిని పార్టీ వైపు నడిపించింది వైసీపీ నేతలే అని చెప్పాలి. ను తన అన్నలా కాదని ప్రూవ్ చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. లా చేయాలంటే పార్టీని బతికించుకోవాలి. లా బతకాలంటే బీజేపీతో కలిసి నడవాలి. నీ అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించారు పవన్.. ఆ పొత్తులోకి దగ్గరుండి మరీ బీజేపీని చేర్చారు. దీ ఏమైనా అల్టిమేట్‌గా అధికారంలోకి రావాలి. రుగా సీఎం కాకపోయినా.. ఆ కూటమిలో కీరోల్ ప్లే చేయాలి. దే పవన్ ఆలోచనగా తెలుస్తోంది.

కూటమిలో కూడా పవన్ 50 సీట్లు డిమాండ్ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేశారంతా.. నీ టీడీపీ కుదరదని తేల్చేసింది. ట్ల సంఖ్య 24 నుంచి 21కు పడిపోయిన అడ్జెస్ట్ అయ్యాడు. రణం తగినంత క్యాడర్ లేదు.. లీడర్లు లేరు. ఇది పవన్ స్వయంకృతాపరాధమనే చెప్పాలి. దుకంటే జనసేన అంటే కేవలం పవనే.. అంతకు మించి మరో ప్రామినెంట్ ఫేస్‌ కనిపించడం లేదు. 2014లో ఇదే సమస్య.. 2019లోనూ ఇదే సమస్య. ఇప్పుడు కూడా అదే సమస్య పార్టీలో చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. జిల్లాల్లో కాన్వాయ్‌ వెంటపడి పరిగేత్తే యూత్‌ తప్ప.. పార్టీకి లీడర్లు కరువయ్యారు. ఇదే లోటు ఇప్పటికి కూడా జనసేనను వేధిస్తోంది. ఇవన్నీ పవన్‌కు తెలియనివి కావు. కానీ బరిలోకి దిగాల్సిందే అంటున్నారు పవన్.

Also Read: రంగంలోకి జనసేనాని, శక్తిపీఠంలో పూజలు, ఆ తర్వాతే..!

ప్రస్తుతం పవన్‌ ముందున్న టార్గెట్.. దక్కించుకున్న 21 సీట్లలో అభ్యర్థులను గెలిపించుకోవడం 2009లో ప్రజారాజ్యం గెలిచిన 18 సీట్ల కంటే.. కనీసం ఒక్క సీటైనా ఎక్కువ గెలుచుకోవాలి. అలా చేస్తేనే పవన్‌కు గౌరవం.. అలా జరిగితేనే పవన్‌కు కూటమిలో గౌరవం.. అలా జరిగేతేనే కూటమి అధికారంలోకి వస్తే కీలక పాత్ర పోషించే చాన్స్.. ఇందులో ఏదీ జరగకపోయినా పవన్‌ రాజకీయ ప్రస్థానానికి, జనసేన మనుగడకే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

అందుకే ప్రస్తుతం ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంతమంది దుమ్మెత్తి పోస్తున్నా.. పవన్ ముందున్న ఏకైక టార్గెట్ ఈసారి జగన్‌ను ఎలాగైనా సీఎం కానివ్వద్దు అనేదే.. అందుకే వైసీపీని దించాలంటే కేంద్రం సహకారం కావాలని చెప్పి బీజేపీకి ఇష్టం లేకపోయినా.. చర్చించి టీడీపీతో పొత్తు పెట్టుకునేందుకు మధ్యవర్తిత్వం చేశారు. సీఎం అవ్వాలన్న డ్రీమ్ వదులుకొని 21 సీట్లకు ఒప్పుకున్నారు. ఇవన్నీంటిలోనూ పవన్ లాంగ్ టర్మ్ ప్లాన్ కనిపిస్తోంది. ప్రస్తుతం తన పార్టీ నిలబడాలన్నా.. అసెంబ్లీలో జనసేన గొంతు వినపడాలన్నా.. టీడీపీతో కలిసి.. బీజేపీ సహకారం తీసుకోవాల్సిందే. వచ్చే ఐదేళ్లలో పార్టీ బలపడితే.. 2029 నాటికి పొత్తుల నుంచి బయటకు వచ్చి అప్పుడు సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగాలన్నది పవన్ ప్లాన్‌లా కనిపిస్తోంది.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News