E-Paper
Advertisement

Mad Sequel: ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ రెడీ.. టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు

Mad Sequel: ‘మ్యాడ్’ సినిమాకు సీక్వెల్ రెడీ.. టైటిల్ రివీల్ చేసిన దర్శకుడు
Advertisement
Mad Sequel
Mad Sequel

Mad Sequel Mad Max: ప్రస్తుతమంతా సీక్వెల్స్ పరంపర కొనసాగుతోంది. ఒక సినిమా హిట్ అయిందంతే చాలు దానికి సీక్వెల్స్ రెడీ అయిపోతుంది. ఒకప్పుడు ఎంతటి స్టార్ హీరో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినా దానికి కొనసాగింపు ఉండేది కాదు.

కానీ, ఈ మధ్య ఈ వ్యవహారం బాగా పెరిగిపోయింది. బడా హీరోల నుంచి మిడిల్ రేంజ్ హీరోల వరకు సీక్వెల్ మూవీలతో వస్తున్నారు. చిన్న హిట్ టాక్ వచ్చినా దానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించేస్తున్నారు. అలా కొనసాగింపుగా వచ్చిన సినిమాలు కూడా మంచి హిట్లు సాధిస్తున్నాయి.

Advertisement

అందుకు నిదర్శనం తాజాగా విడుదలైన టిల్లు స్క్వేర్ మూవీనే. గతంలో డీజే టిల్లుతో ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీనికి కొనసాగింపుగా రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

Also Read: ఇండస్ట్రీలో మరో విషాదం.. రామ్ చరణ్ మూవీ నటుడు కన్నుమూత

Advertisement

అయితే ఇప్పుడు అదే కోవలోకి మరో మిడిల్ రేంజ్ సినిమా రాబోతుంది. గతేడాది ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. కడుపుబ్బా నవ్వించిన సినిమాకి ఇప్పుడు సీక్వెల్ కూడా ఉంటుందని తెలిపారు. అయితే ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా?.. అదేనండి ‘మ్యాడ్’ మూవీ.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించి మెప్పించారు. అలాగే అనంతిక, గౌరి ప్రియారెడ్డి, గోపిక విజయన్ హీరోయిన్లుగా అలరించారు. మొదట్లో ఈ చిన్న సినిమా ఏం చూస్తాంలే అని అంతా అనుకున్నారు. కానీ అంచలంచలుగా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో థియేటర్లకు పరుగులు పెట్టారు.

అయితే ఈ మూవీ హిట్ కావడానికి ముఖ్యంగా కామెడీయే కారణం అని చెప్పాలి. దాంతోపాటు సాంగ్స్ కూడా సినీ ప్రియుల్లో ఫుల్ జోష్ నింపడంతో సినిమా మంచి హిట్ అందుకుంది. మరి సినిమా హిట్ అయిందంటే.. దానికి సీక్వెల్ కూడా ఉంటుందనేది సినీ ప్రియుల గట్టి నమ్మకం.

Also Read: బిగ్ బ్రేకింగ్.. టీడీపీలో చేరిన టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్

తాజాగా వారి నమ్మకం నిజమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫుల్ క్లారిటీ తాజాగా వచ్చేసింది. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన కల్యాణ్ శంకర్.. టిల్లు స్వేర్ సినిమాకి రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశారు. ఈ తరుణంలో తాజాగా టిల్లు స్క్వేర్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఆయన ‘మ్యాడ్’ సినిమా సీక్వెల్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘మ్యాడ్’ సినిమా సీక్వెల్‌కి సిద్ధంగా ఉందని అన్నాడు. అంతేకాకండా టైటిల్ కూడా ఫిక్స్ చేశామని దీనికి ‘మ్యాడ్ మాక్స్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని అదిరిపోయే అప్డేట్ అందించాడు. దీంతోపాటు ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 12వ తేదీ నుంచి స్టార్ట్ కాబోతుందని తెలిపాడు. ఈ అప్డేట్‌తో ప్రేక్షకాభిమానులు ఎగిరిగంతేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ అంతా కాలేజీ నేపథ్యంలో సాగిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ పార్ట్ వచ్చేసరికి.. ఈ ముగ్గురు హీరోలు ఉద్యోగాలను వెతుక్కునే పనిలో పడతారని తెలుస్తోంది.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×