LSG vs PBKS match prediction(Cricket news today telugu): ఐపీఎల్ జట్లలో ఫ్రాంచైజీలన్నీ ప్రైవేటు వారివే, అంతేకాదు వాళ్లు ఆటగాళ్లపై, ఆటపై కోట్లు ఖర్చు పెడుతుంటారు. అందుకని ప్రతీ మ్యాచ్ అగ్ని పరీక్షగానే ఉంటుంది. ఈ క్రమంలో శనివారం నాడు రాత్రి 7.30 గంటలకు లక్నో స్టేడియంలో జరగనున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో లక్నో రెండు మ్యాచ్ లు విజయం సాధించగా, పంజాబ్ ఒకసారి విజయం సాధించింది.
2024 ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉన్న లక్నో సూపర్ జెయింట్స్ ఇంకా బోణీ కొట్టలేదు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే జట్టులో కేఎల్ రాహుల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా బాధ్యతగా ఆడుతున్నారు.
ఓపెనర్ డికాక్, పడిక్కల్ నిరాశ పరిచారు. బౌలింగ్ కూడా ఇంకా గాడిన పడలేదు. నవీన్, మోసిన్, బిష్ణోయ్, కృనాల్ పాండ్యా అందరూ భారీగా పరుగులు సమర్పించారు. దీంతో ఈరోజు జరగబోయే మ్యాచ్ గెలవక తప్పని పరిస్థితుల్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు.
Also Read: ఆఫ్ కట్టర్స్ వేయాలనే వ్యూహంతో వచ్చాం: కమిన్స్
శిఖర్ దావన్ కెప్టెన్ గా ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్ లో గెలిచి, ఒక మ్యాచ్ లో చతికిల పడింది. మళ్లీ పంజాబ్ జట్టుని పట్టాలెక్కించాలని ధావన్ శతవిధాలా ఆలోచిస్తున్నాడు.సామ్ కరన్, లియామ్ లివింగ్స్టన్, అర్ష్దీప్ రాణించడంతో ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది.
సెకండ్ మ్యాచ్లో బ్యాటింగ్ లో అందరూ విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. ధావన్ తప్ప ఎవరూ బాధ్యతగా రన్స్ చేయడం లేదు. బౌలింగ్ విషయానికి వస్తే రబాడ, హర్ప్రీత్ బ్రార్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. ఇంక అర్ష్దీప్, హర్షల్ పటేల్ భారీగా పరుగులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సేన వళ్లు వంచక తప్పదని అంటున్నారు.
పంజాబ్ జట్టులో ఇలా ఉండవచ్చు: శిఖర్ ధావన్, జానీ బెయిర్స్టో, ప్రభుసిమ్రన్ సింగ్, లియామ్ లివింగ్స్టన్, సామ్ కర్రన్, జితేష్ శర్మ, శశాంక్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబాడ, రాహుల్ చాహర్.
లక్నోజట్టులో ఇలా ఉండవచ్చు: క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), ప్రేరక్ మన్కడ్, ఆయుష్ బదోనీ, దీపక్ హుడా, నికోలస్ పూరన్, మార్కస్ స్టొయినిస్, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, మోసిన్ ఖాన్, యష్ ఠాకూర్.