JC Prabhakar on Madhavi Latha: నటి మాధవీలత- జేపీ ప్రభాకర్‌రెడ్డి మాటల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఆమె విషయంలో టీడీపీ నేత వెనక్కి తగ్గారు. ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఆవేశంతో నటి మాధవిలతపై ఆ పదం వాడడం ముమ్మాటికీ తప్పేనని అన్నారు. ఆ అమ్మాయిపై ఆవేశంతో అన్నాను.. అది తప్పనని, మహిళలంటే తనకు గౌరవమేనని అన్నారు.
ఎక్కడో మూలన ఉన్నవారు తనను అనరాని మాటలు అన్నారని, ఈ రోజు పదవి, గన్‌మెన్లు ఉన్నాయని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు జేసీ. చిన్న తప్పును షాకుగా చూపించి బీజేపీ నేతలు తనపై రకరకాలుగా మాట్లాడడంపై ఆవేశంతో ఊగిపోయారాయన. తనపై విమర్శలు చేసిన వాళ్లంతా ఫ్లెక్సీ గాళ్లేనని కాసింత ఘాటుగా వ్యాఖ్యానించారు.
పదవి పోతే ప్రజలు వారివైపు చూడరని కాసింత ఘాటుగా విమర్శించారు జేసీ. బీజేపీ నాయకులు గన్‌మెన్లు పెట్టుకొని తిరుగుతూ విమర్శలు చేశారన్నారు. తాను, నా కొడుకు గన్‌మెన్లు లేకున్నా ధైర్యంగా ముందుకు వెళ్తున్నామని, కొన్ని విషయాల్లో వెనక్కి తగ్గేది లేదన్నారు. తనను పార్టీ మారమని అనడానికి బీజేపీ నాయకులకు ఏ అర్హత ఉందని మండిపడ్డారు.
తాడిపత్రి ప్రజల కోసం ఎన్ని త్యాగాలు అయినా చేస్తానని, ఎన్ని మెట్లయినా దిగుతానన్నారు. సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టే టీడీపీలో ఉన్నానని చెప్పుకొచ్చారు. నటి మాధవిలత వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు సీరియస్‌గా రియాక్ట్ అయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జేసీ ప్రభాకర్‌రెడ్డి.
ALSO READ: రీతూ – భారతీ బిగ్ స్కామ్.. టెన్షన్‌లో జగన్!