Education Privatisation Rahul Gandhi| ప్రైవేటీకరణ ద్వారా నాణ్యమైన విద్యను సాధించలేమని.. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇచ్చినా లాభం లేదని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. శనివారం జనవరి 4, 2025న రాహుల్ గాంధీ ఐఐటి మద్రాస్ క్యాంపస్ లో విద్యార్థులతో చర్చించారు. నాణ్యమైన విద్యను సాధించాలంటే ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని, అందుకోసం ఇప్పుడు విద్య కోసం కేటాయించిన బడ్జెట్ కంటే చాలా అధికమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
లోకసభలో ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీ ఐఐటి మద్రాస్ విద్యార్థులతో భారతదేశ విద్యా విధానం, అందులోని లోపాలు, రావాల్సిన మార్పుల గురించి చర్చించారు. “ప్రజలకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రతీ ప్రభుత్వం వహించాలన నేను నమ్ముతున్నాను. ఈ నాణ్యమైన విద్య ప్రైవేటీకరణ ద్వారా అయితే సాధించలేం. మేము విద్య కోసం, ప్రభుత్వ సంస్థల బలోపేతం కోసం చాలా ధనం ఖర్చు పెట్టాలి.” అని రాహుల్ గాంధీ చెబుతన్న వీడియోను ఆయన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఆయన ఐఐటి మద్రాస్ విద్యార్థులతో చర్చిస్తూ కనిపించారు. రాహుల్ గాంధీ వాట్సాప్ ఛానెల్ లో కూడా వీడియోలను షేర్ చేశారు.
Also Read: ప్రార్థనా స్థలాల చట్టంపై ఓవైసీ పిటీషన్.. విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు!
వీడియోలో ఇంకా ముందుకు సాగితే. రాహుల్ గాంధీ భారతదేశం లోని విద్యను కొత్త దారిలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్యార్థులు సంప్రదాయ వృత్తులను కాకుండా తమ ప్యాషన్ కోసం సృజనాత్మకవైపు వెళ్లేందుకు అందరూ ప్రోత్సహించాలని చెప్పారు. అప్పుడే దేశంలో ఉత్పాదక పెరిగి ప్రపంచంలో మన దేశ నాయకత్వ లక్షణాలకు గుర్తింపు లభింస్తుందని చెప్పారు.
అయితే ఐఐటి మద్రాస్ విద్యార్థులు రాహుల్ గాంధీని బిజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న తేడా ఏంటని ప్రశ్నించారు. దానికి రాహుల్ సమాధానమిస్తూ.. “కాంగ్రెస్ పార్టీ దేశాభివృద్ధి కోసం వనురులన్నీ సమాజంలో అందరికీ లభించాలని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్ముతుంది. కానీ బిజేపీ మాత్రం అభివృద్ధి కోసం ఎవరినీ లెక్కచేయకుండా ముందుకు వెళుతుంది. ఆర్థిక వ్యవస్థను మూడు రెట్లు పెంచేయాలని మాత్రమే ఆలోచిస్తారు. దాంతో కొందరి అభివృద్ది మాత్రమే జరుగుతుంది. సమాజంలో అందరూ కలిసి మెలిసి ఉంటేనే దేశానికి మేలు జరుగుతుంది. అందుకే నేను ప్రైవేటీకరణకు వ్యతిరేకం.
ముఖ్యంగా విద్యారంగం ప్రైవేటీకరణ వల్ల నాణ్యత కోల్పోతున్నం. అందుకే చూడండి మన దేశంలో ఉన్న బెస్ట్ విద్యాసంస్థల్లో ప్రభత్వ సంస్థలే ఉన్నాయి. మీది (ఐఐటి మద్రాస్) కూడా అందులో ఒకటి. మన దేశంలోని విద్యా వ్యవస్థలో చాలా లోపాలున్నాయి. ఇది చాలా సంకుచిత వ్యవస్థలో ఉంది. ఇందులో పిల్లల క్రియేటివిటీ, సృజనాత్మకతకు ప్రోత్సహించడం జరగడం లేదు. నేను భారత జోడో యాత్ర చేసినప్పుడు కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చాలా మంది పిల్లలు, విద్యార్థులను కలిశాను . వారంతా పెద్దవారయ్యాక డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఐఎఎస్ లు మాత్రమే అవుతామని చెప్పారు. కానీ ఇవి మాత్రమే సక్సెస్ కు కొలమానం కాదుగా.. పిల్లల ఆసక్తి ఏ రంగంలో ఉంటే వారిని ఆ విద్యా కోర్సుల్లోనే ప్రోత్సహించాలి. ” అని రాహుల్ వివరించారు.