Tirupati News: తిరుమలలో ఏడు కొండల వెంకటేశ్వరుడ్ని దర్శించుకోవాలని భక్తులు ఆరాటపడతారు. ఆయన అనుగ్రహం లేకుంటే దర్శనం కష్టం. ఈ విషయాన్ని చాలా మంది భక్తులు చెప్పారు కూడా. తాజాగా హైదరాబాద్ చెందిన ఓ ఫ్యామిలీకి చెందిన 16 గ్రాముల బంగారు నగలు చోరీ కావడం కలకలం రేపింది.
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని భావిస్తారు భక్తులు. ఏపీ నుంచి మాత్రమేకాదు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రతీ రోజూ వేలల్లో అక్కడికి వస్తుంటారు. ఇదే క్రమంలో హైదరాబాద్‌లో కూకట్‌పల్లిలోని ప్రగతినగర్ ప్రాంతానికి చెందిన శ్రీదేవి కుటుంబం శ్రీవారి దర్శనానికి రాక తిరుపతిలో దిగింది. రైల్వేస్టేషన్‌కు సమీపంలో ఉండే విష్ణు నివాసంలోని రూమ్ నెంబర్ 613లో స్టే చేశారు.
రూమ్‌లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి వారి బంగారు నగలు కాజేశారు. మొత్తమంతా 16 గ్రాములు నగలు అపహరణకు గురయ్యాయి. ఎక్కడో పెట్టామని రూమ్ అంతా వెతికారు. చివరకు ఎవరో వ్యక్తి లోపలికి వచ్చి వాటిని కాజేసినట్టు గుర్తించారు. చివరకు బాధితుల ఫిర్యాదు మేరకు తిరుపతిలోని తూర్పు ప్రాంతానికి చెందిన పోలీసులు కేసు నమోదు చేశారు.
బిల్డింగ్‌లో ఉన్న సీసీకెమెరాలను పరిశీలిస్తున్నారు పోలీసులు. స్థానికంగా అక్కడ ఉండేవారి పని కావచ్చని భావిస్తున్నారు. శ్రీదేవి ఫ్యామిలీ ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడింది. 16 గ్రాముల బంగారం అంటే ఆషామాషీ కాదు.
ALSO READ: ఏపీ లిక్కర్ కుంభకోణం.. విచారణలో ఈడీ, వైసీపీ బెంబేలు
ఇప్పుడు ధరల్లో పోల్చితే దాదాపు 16 లక్షలన్నమాట. ఒకప్పుడు తిరుపతిలో భక్తుల రద్దీ తక్కువగా ఉండేది. ఈ మధ్యకాలంలో అధికంగా తరలివస్తున్నారు. టీటీడీ వసతి గృహాల్లో కనీసం నడవడానికి చోటు కూడా ఉండలేదు. ఏ ఫ్లోర్ చేసినా భక్తులే కనిపిస్తున్నారు.