Kamal Haasan : విశ్వ నటుడు కమలహాసన్(Kamal Haasan ) భాషతో సంబంధం లేకుండా తన అద్భుతమైన నటనతో విశ్వ నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం మణిరత్నం(Maniratnam ) దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. జూన్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ (AR Rahman) సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన కమలహాసన్ కి సంబంధించిన మరో వార్త ఇప్పుడు తెరపైకి వచ్చింది అసలు విషయంలోకి వెళ్తే కమలహాసన్ కు ఇప్పుడు రాజ్యసభ సీట్ ఇవ్వాలి అని తమిళనాడు రాజకీయాలు భావించినట్లు సమాచారం.
కమలహాసన్ కు డీఎంకే రాజ్యసభ సీటు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ సినీ హీరోగా, ‘ మక్కల్ నీది మయ్యం’ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్ ను తమిళనాడు అధికార పార్టీ డిఎంకె రాజ్యసభకు పంపించనున్నట్లు సమాచారం. గత ఏడాది మార్చిలో లోకసభ ఎన్నికలు జరిగినప్పుడు కమలహాసన్ డిఎంకె పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు డీఎంకే కమలహాసన్ ను రాజ్యసభ సీటుకు పంపించాల్సి ఉందని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ విషయం తమిళ రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. ఇక డీఎంకే నిర్ణయం వెనుక అటు తమిళనాడు రాజకీయాలలో కూడా వాడి వేడిగా చర్చలు మొదలయ్యాయి.
వివాదంలో చిక్కుకున్న కమలహాసన్..
ఇదిలా ఉండగా మరొకవైపు కమలహాసన్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న థగ్ లైఫ్ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి చెన్నైలో ఘనంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజు కుమార్ కూడా విచ్చేశారు. అయితే ఆయనను చూస్తూ ఆయన ముందే తమిళం నుండి కన్నడ పుట్టింది అంటూ కన్నడ భాషను కించపరిచేలా కమలహాసన్ చేసిన కామెంట్లు ఒక్కసారిగా కర్ణాటకలో భగ్గుమన్నాయి. కమలహాసన్ సంస్కారహీనుడు అని వెంటనే బహిరంగంగా కన్నడిగులకు క్షమాపణలు చెప్పాలి అని కర్ణాటక రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.మాతృభాషను ప్రేమించడం తప్పు కాదు ఇతర భాషలపై ఇలా సంస్కారం లేని మాటలు మాట్లాడడం తప్పు. కమలహాసన్ గొప్ప భాషా చరిత్రకారుడేమీ కాదు. ముఖ్యంగా కన్నడ స్టార్ హీరో ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం ఏమంత సమంజసంగా లేదు. 6.5 కోట్ల కన్నడిగులను అవమానపరిచిన కమలహాసన్ వెంటనే భేషరతుగా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ ఆయన మండిపడ్డారు మరి దీనిపై కమలహాసన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఇక ఇలా వివాదాలు ఒక్కదాని తర్వాత ఒకటి చుట్టూ ముదురుతున్న వేళ మళ్ళీ రాజ్యసభ సీటు ఇంకో సంచలనంగా మారింది. మరి వీటన్నింటిపై కమలహాసన్ స్పందిస్తారేమో చూడాలి.
ALSO READ:Taara Taara Song : వీరమల్లు ఐటెం సాంగ్ వచ్చేసింది… ‘తార తార నా కళ్లు’ అంటూ…