E-Paper
Advertisement

ట్రాన్స్ జెండర్లకు వార్నింగ్.. అక్రమ వసూళ్లు చేస్తే తాట తీస్తాం!

ట్రాన్స్ జెండర్లకు వార్నింగ్.. అక్రమ వసూళ్లు చేస్తే తాట తీస్తాం!
Advertisement

Transgender Row: ట్రాన్స్ జెండర్లు ఏదైనా అంటే ఏదో జరిగిపోతుందన్న నమ్మకాలు.. జనాన్ని హడలెత్తిస్తున్నాయ్. అసలే శుభకార్యం. ఏమైనా అంటే ఎందుకొచ్చిన గొడవ అంటూ చాలా మంది అడిగింది ఇచ్చుకుంటున్నారు. నిజానికి ఇచ్చింది తీసుకోవాలి. వెళ్లిపోవాలి. కానీ కొందరు ట్రాన్స్ జెండర్లు అలా కాదు.. అడిగింది ఇవ్వకపోతే నానా రచ్చ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని చింతల్‌లో జరిగిన ఓ గృహప్రవేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రాన్స్‌జెండర్ల బృందం భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేసిందని, ఇవ్వలేమని చెప్పడంతో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలు వచ్చాయ్. ఈ తరహా ఫిర్యాదులు పెరగడంతో డీజీపీ సీవీ ఆనంద్ కూడా సీరియస్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. కొందరి చర్యలతో మొత్తం ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఇబ్బంది వస్తోంది. నిజానికి వీళ్లు గౌరవప్రదంగా జీవించేందుకు తెలంగాణ ప్రభుత్వం చాలా అవకాశాలు కల్పిస్తోంది. ట్రాఫిక్ అసిస్టెంట్లు, HYDRAAలో పనిచేస్తున్న పలువురు ట్రాన్స్ జెండర్లు మంచి పేరు తెచ్చుకుంటున్నారు. మరి స్పెషల్ డ్రైవ్‌ ఇలాంటి బలవంతపు వసూళ్లకు చెక్ పెడుతుందా?

Tags

Related News

ఏపీ లోకల్ వార్.. చంపడమా? చావడమా?

సెల్ ఫోన్‌కి బానిసలవుతున్న జనం..

చిన్న శ్రీను రాజీనామా వెనుక.. జడ్పీ పీఠమే కారణమా?

శుద్ధి రాజకీయం!

ఇట్స్ టైం టు చెక్.. సభ్యత్వాల రద్దు తప్పదా?

స్థానిక ఎన్నికలపై జగన్ మరో కొత్త స్కెచ్!

ఏపీ కాంగ్రెస్‌కు కొత్త ఇంచార్జి.. షర్మిలకు కొత్త ట్విస్ట్?

Big Stories

Advertisement
×