Assembly Row: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇప్పుడు ప్రజా సమస్యల కంటే… రాజకీయ రగడతోనే ఎక్కువగా హైలైట్ అవుతున్నాయ్. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలు.. ఆ తర్వాత తాతా మధు, నవీన్‌రెడ్డిపై కేసులు, అరెస్టులు.. చివరకు శాసనమండలి నుంచి సమావేశాల పూర్తికాలం సస్పెన్షన్. ఇదంతా పొలిటికల్ గేమ్ ను మార్చేశాయి. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా… సభా మర్యాదలు పాటించాల్సిన బాధ్యత లేదా? అన్న ప్రశ్నలు వస్తున్నాయ్. నిరసనకు హక్కుంది.. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కుంది.. కానీ వ్యక్తిగత దూషణలకు, దురుసు ప్రవర్తనకు చట్టసభే వేదిక చేసుకోవడం కరెక్టా అన్న క్వశ్చన్లు వస్తున్నాయి. తాతా మధు, నవీన్‌రెడ్డి ఇష్యూలో ఎథిక్స్ కమిటీ ఏం చర్యలు తీసుకోబోతోందన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసినా సభ్యత్వం విషయంలో వేటు తప్పదా అన్న చర్చ జరుగుతోంది.