BigTV English

EX minister Jogi ramesh: మాజీమంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు, ఇంటిపై ఏసీబీ దాడులు, వీలైతే అరెస్ట్..

EX minister Jogi ramesh: మాజీమంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు, ఇంటిపై ఏసీబీ దాడులు, వీలైతే అరెస్ట్..

ACB raids on Jogi Ramesh(Political news in AP): వైసీపీ నేతల డొంక కదులుతోంది. కీలక నేతలపై కూటమి సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే మదనపల్లి ఫైల్స్ కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి ప్రమేయమున్నట్లు వార్తలు వస్తున్నాయి.


తాజాగా మాజీ మంత్రి, వైసీపీ ఫైర్‌బ్రాండ్ జోగి రమేష్ వంతైంది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఉమ్మడి కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీమంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు నిర్వహిస్తోంది. మొత్తం 15 ఏసీబీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు, సోదాలు ముమ్మరం చేశారు.

మంగళవారం ఉదయం ఐదుగంటల నుంచి మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలకు దిగింది. గన్నవరంలోని అగ్రి‌ గోల్డ్ భూముల వ్యవహారంలో ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఐడీ అధికారులు ఇప్పటికే జప్తు చేసిన భూములు.. క్రయవిక్రయాలు జరిగాయి. డీజీపీ ఆదేశాలతో ఏసీబీ రంగంలోకి దిగింది.


ALSO READ: అమరావతిలో వరల్డ్ బ్యాంకు టీమ్, సీఎం చంద్రబాబుతో భేటీ.. కాకపోతే,

వైసీపీ పాలనలో గన్నవరంలోని సర్వే నెంబర్లు మార్చి వేర్వేరు పేర్ల మీద ఆయా భూములను రిజిస్ట్రేషన్ చేయించి, వాటిని అమ్మడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి జోగి రమేష్, అధికారులపై ఒత్తిడి చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు డీజీపీకి నివేదికలు వెళ్లాయి.

సీఐడీ ఆధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను ఏ విధంగా విక్రయించారు? అవతలివారు ఆ భూములను  ఎలా కొనుగోలు చేశారు? ఇందులో అధికారుల పాత్ర ఏమిటి? అనేదానిపై క్లారిటీ రానుంది. విచారణలో తేలిన అంశాల ప్రకారం జోగి రమేష్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

 

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×