BigTV English

Jr NTR vs TDP : “రా కదిలిరా” సభలో గొడవ.. టీడీపీ కార్యకర్తలు- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..

Jr NTR vs TDP : ఆచంటలో టీడీపీ రా కదలి రా భారీ బహిరంగ ను టీడీపీ – జనసేన ఆద్వర్యంలో నిర్వహించారు. ఈ సభకు టీడీపీ కార్యకర్తలతో పాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కటౌట్లు పట్టుకొని సభకు హాజరయ్యారు. అయితే ఆ జెండాలు కేవలం అభిమానాన్ని చాటుకొనే జెండాలు, కటౌట్ లు కావు. వాటిపైన కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని రాసి ఉండడం గమనార్హం . టీడీపీ కార్యకర్తలే ఈ జెండాలు పట్టుకొని ఉండడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

Jr NTR vs TDP : “రా కదిలిరా” సభలో గొడవ.. టీడీపీ కార్యకర్తలు- ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణ..

Jr NTR vs TDP : ఆచంటలో టీడీపీ రా కదలి రా భారీ బహిరంగ సభ టీడీపీ – జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సభలో టీడీపీ కార్యకర్తలతోపాటుగా పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు. అలాగే కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కటౌట్లు పట్టుకొని సభకు హాజరయ్యారు. వాటిపై కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అని రాసి ఉంది. ఫ్యాన్స్ ఈ జెండాలు పట్టుకొని ఉండడం సర్వత్రా చర్చనీయాంశమైంది.


సభ జరుగుతుండగానే టీడీపీ కార్యకర్తలు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య ఘర్షణ వాతావరణ ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకు ఉన్నటువంటి అంతర్గత వర్గ విభేదాలు ఒక్క సారిగా బహిర్గతమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. తమ హీరో కటౌట్ పట్టుకుని స్టేజి వైపు వెళ్లే ప్రయత్నం చేశారు. జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ కటౌట్‌ను టీడీపీ కార్యకర్తలు లాక్కునే ప్రయత్నం చేశారు.

ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌.. ఇటు టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. దీంతో టీడీపీ నేతలు కలుగజేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు వర్గాలుగా విడిపోవడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది.


Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×