BigTV English

Ease My Trip : మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేత.. ఈజ్ మై ట్రిప్ సంచలన నిర్ణయం..

Delhi : ఇండియా‌ని విమర్శిస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఈజ్ మైట్రిక్ ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి ఈజ్ మైట్రిక్ సంస్థను 2008లో స్థాపించారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.

Ease My Trip : మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపివేత.. ఈజ్ మై ట్రిప్ సంచలన నిర్ణయం..

Ease My Trip : ఇండియా‌ను విమర్శిస్తూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌ మై ట్రిప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి ఈజ్ మై ట్రిప్ ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి ఈజ్ మైట్రిక్ సంస్థను 2008లో స్థాపించారు. ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది.


ప్రధాని మోదీ గతవారం లక్షద్వీప్‌లో పర్యటించి సాహసాలు చేయాలనుకునేవారు అద్బుతమైన ప్రదేశం అని తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ప్రధాని పర్యటన అనంతరం ఈజ్‌ మై ట్రిప్‌ స్పందించింది. లక్షద్వీప్‌లోని బీచ్‌లు కూడా మాల్దీవులు కంటే అందమైన పర్యాటక ప్రదేశం అని పేర్కొంది. లక్షద్వీప్‌లు వెళ్లే వారి కోసం తమ సంస్థ క్రేజీ ఆఫర్లు తీసుకురానుంది అని ప్రకటించింది. చలో లక్షద్వీప్‌ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. ప్రధాని మోదీపై మాల్దీవులు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ఈజ్‌ మై ట్రిప్‌ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ వివాదంపై మాల్దీవుల మాజీ మంత్రి అహ్మద్ మహ్లూఫ్ స్పందించారు. పొరుగుదేశంపై చేసిన వ్యాఖ్యలతో వివిధ పరిణామాలు ఏర్పడుతున్నాయి. పరిస్థితులు అందోళనకు గురి చేస్తున్నాయని ప్రకటించారు. ఇండియా టూరిస్ట్‌లు మాల్దీవులు పర్యటన బహిష్కరిస్తే తమ దేశ ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్ధిక వ్యవస్థ పతనం అయితే తమ దేశం కోలుకోవడం కష్టం అని పేర్కొన్నారు. తమ దేశ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు.


ఈ అంశంపై ఎంపీ ఎవా అబ్దుల్లా స్పందిస్తూ మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలు పట్ల భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. తమ దేశ నేతలు అలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. తమ దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న బాయ్ కాట్ ప్రచారం నిలిపివేయాలని అభ్యర్ధించారు. మాల్దీవుల తరఫున భారత్ కు క్షమాపణలు తెలుపుతున్నామని తెలిపారు.

Tags

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×