BigTV English

Botsa Satyanarayana : మంత్రి బొత్సకు నిరసన సెగ.. వాహనాన్ని అడ్డుకున్న అంగన్వాడీలు..

Botsa Satyanarayana : విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని మంత్రిని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని మంత్రికి అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. సరిపోని జీతాలతో కుటుంబం పోషించడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించం దారుణమన్నారు.

Botsa Satyanarayana : మంత్రి బొత్సకు నిరసన సెగ..  వాహనాన్ని అడ్డుకున్న అంగన్వాడీలు..

Botsa Satyanarayana : విజయనగరం జిల్లాలోని గజపతినగరం జాతీయ రహదారిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రయాణిస్తున్న వాహనాన్ని అంగన్వాడీ కార్యకర్తలు అడ్డగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని మంత్రిని కోరారు.


ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని మంత్రికి అంగన్వాడీలు విజ్ఞప్తి చేశారు. చాలిచాలని జీతాలతో కుటుంబం పోషించడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించం దారుణమన్నారు.

అంగన్వాడీ కార్యకర్తలు వినతిపై మంత్రి బొత్స స్పందించారు. అంగన్వాడీ డిమాండ్ ల్లో వేతనం పెంపు తప్ప అన్ని డిమాండ్ లు నేరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే జీతాలు కంటే తమ ప్రభుత్వం అధికంగానే వేతనాలు ఇస్తోందన్నారు.


అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె వల్ల బాలింతలు, గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని సార్లు సమ్మె విరమించమని విజ్ఞప్తి చేసినా అంగన్వాడీలు పట్టించుకోలేదన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించాల్సి వచ్చిందన్నారు. సమ్మెను విరమించిన మరుక్షణమే ఎస్మా రద్దు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×