BigTV English

AP Governor : ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం..

AP Governor : ఏపీ గవర్నర్ గా జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం..

AP Governor : ఏపీ గవర్నర్ గా జస్టిస్ ఎస్ . అబ్దుల్ నజీర్ బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని రాజ్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, మంత్రులు, న్యాయమూర్తులు, ప్రతిపక్ష నేత చంద్రబాబు పాల్గొన్నారు. వారంతా కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు శుభాకాంక్షలు తెలిపారు.



జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 జనవరి 5న కర్నాటకలోని మూడబిదరి తాలుకాలోని బెలివాయిలో జన్మించారు. మూడబిదరిలోని మహావీర కళాశాలలో బీకాం చదివారు. ఆ తర్వాత మంగళూరు కొడియాల్ బెయిల్ ఎస్ డీఎంలా కళాశాలలో లా డిగ్రీ చేశారు. 1983 ఫిబ్రవరి 18న న్యాయమూర్తిగా పేరు నమోదు చేయించుకున్నారు. కర్ణాటక హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2003 మే 12న కర్ణాటక హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2004 సెప్టెంబర్ 24న శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ అబ్దుల్ నజీర్ పదోన్నతి పొందారు. 2017న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఈ ఏడాది జనవరి 4 వరకు జస్టిస్ అబ్దుల్ నజీర్ సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.

ఇటీవల ఆయనను కేంద్రం ఏపీకి గవర్నర్ కు నియమించింది. ఈ నేపథ్యంలో విజయవాడ వచ్చి రాజ్ భవన్ లో గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు.


Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×