KA Paul : మీరు చదివింది నిజమే. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాకిస్తాన్ వెళ్తున్నారు. ఎందుకేంటి? అనే డౌటే అవసరం లేదు. ఇంకెందుకు యుద్ధం ఆపడానికే. పాక్‌తో చర్చలు జరపడానికే. శాంతి కోసం ఆయన ఏదైనా చేస్తారు. ఎక్కడికైనా వెళతారు. ఆయనేమైనా మనలాంటి సాధారణ మనిషా? ప్రపంచ శాంతి దూత. ది వన్ అండ్ ఓన్లీ కేఏ పాల్.
పాల్ వీడియో వైరల్
తాను చెబితే అమెరికా అధ్యక్షులే విన్నారు. ఇరాన్, అఫ్ఘనిస్తాన్‌లతో యుద్ధాలు ఆపేశారు. పాకిస్తాన్‌కు కూడా అలానే చెబుతా.. యుద్ధం ఆపేస్తా.. అనేది పాల్ మాట. అమెరికా అంటే మనం మనం క్రిష్టియన్స్ అనే ఫీలింగ్‌తో పాల్ మాట విన్నారేమో. మరి, పాకిస్తాన్ అసలే కరుడుగట్టిన ముస్లిం కంట్రీ. అందులోనూ ఇండియా నుంచి వచ్చారని తెలిస్తే.. ఊరుకుంటుందా? జర జాగ్రత్త పాల్ గారూ.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. పాల్ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.
ఆదివారం పాక్‌కు పాల్
యుద్ధం వచ్చిందంటే చాలు.. కేఏ పాల్ ఊడిపడుతుంటారు. ప్రెస్‌మీట్లు పెట్టి ఆయన చెప్పాలనుకున్నది చెబుతారు. ఎవరైనా వింటారా? నమ్ముతారా? అనేది వేరే విషయం. లేటెస్ట్‌గా పాక్‌పై భారత్ చేసిన అటాక్స్‌పైనా పాల్ స్పందించారు. ఇండియా టార్గెట్ చేసింది కేవలం టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమేనని.. పూర్తి స్థాయి యుద్ధాన్ని ఆపే బాధ్యతను పైనున్న ఆ దేవుడు తనపై పెట్టాడని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్ వద్దని తాను వారించానని అన్నారు. శనివారం ఢిల్లీ వెళ్లి మోదీ, అమిత్ షా లను కలుస్తానని తెలిపారు. అటునుంచి అటే.. ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నానని.. యుద్ధం ఆపడానికి దాయాది దేశంలో చర్చలు జరుపుతున్నానని సెలవిచ్చారు ఏకే పాల్. పాపం పాల్. శాంతి కోసం ఎంతగా ప్రయత్నిస్తున్నారో కదా.
జగన్ క్రిస్టియనే కాదు..
ఇక, పాల్ మాట్లాడటానికి ఆ టాపిక్, ఈ టాపిక్ అనే తేడా ఉంటుందా? యుద్ధాల నుంచి హత్యల వరకు అన్నీ ఆయనకు కొట్టిన పిండే. ఎలాగూ ప్రెస్‌మీట్ పెట్టాను కదాని పనిలో పనిగా జగన్ గురించి, పాస్టర్ ప్రవీణ్ గురించీ తనదైన స్టైల్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జగన్ అసలు క్రిస్టియన్ కానే కాదని.. జగన్ చిన్నజీయర్ స్వామి భక్తుడని బాంబు పేల్చారు. తన ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే.. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయాడని అన్నారు. ఇప్పుడున్న రాజకీయ నేతలంతా మోదీ తోత్తులని అందరికీ కలిపి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చిపడేశారు.
Also Read : ఎలా పుడతార్రా పాకి కొ**ల్లారా.. నారాయణపై మండిపడ్డ నటుడు..
పాల్‌కు అధికారం వస్తేనే..
మరోవైపు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపైనా మాట్లాడారు పాల్. ప్రవీణ్‌ను హత్య చేశారనే కోణంలో దర్యాప్తు చేయాలంటూ తాను హైకోర్టును కోరానని.. అయితే రూ. 5 లక్షలు డిపాజిట్ చేయమని జడ్జి చెప్పారని అన్నారు. ప్రజల కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు కేఏ పాల్. చివరాఖరికి ప్రెస్‌మీట్ ముగించే ముందు ఓ పంచ్ డైలాగ్ కూడా కొట్టారాయన. అదేంటంటే.. “KA పాల్‌కి అధికారం వస్తేనే పాలన మారుతుంది”. అంతేగా.. అంతేగా!
మాజీ సీఎం వైఎస్ జగన్ పై కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు..
జగన్ అసలు క్రిస్టియన్ కాదు.. చిన్న జీయర్ భక్తుడు
నా ఆశీర్వాదం తీసుకోలేదు కాబట్టే జగన్ చిత్తుగా ఓడిపోయారు
– కే.ఏ.పాల్ pic.twitter.com/cUmhrA6INC
— BIG TV Breaking News (@bigtvtelugu) May 8, 2025