Operation Sindoor: జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామలో జరిగిన ఉగ్రదాడితో ఒక్కసారిగా భారతదేశం ఉలిక్కిపడింది.. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిలో దాదాపు 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ”ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ సైనిక చర్యకు దేశవ్యాప్తంగా మద్దతు లభించింది. పహల్గాం టెర్రర్ అటాక్ లో ప్రాణాలు కోల్పోయిన అమాయకపు టూరిస్టులకు న్యాయం చేసారంటూ సినీ సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.. అయితే సిపిఐ నారాయణ మాత్రం ఈ భారత్ చేసిన దాడిపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన వ్యాఖ్యలపై సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగర్ స్పందించారు.. ఆయన ఏమన్నారు ఒకసారి తెలుసుకుందాం..
పాక్ ఉగ్రవాదాడిని తిప్పికొట్టిన భారత్..
పాక్ ఉగ్రవాదులు టూరిస్ట్ ల పై చేసిన దాడికి భారత్ ప్రతి స్పందనగా ఆపరేషన్ సింధూర అనే పేరుతో ఆ దాడిని తిప్పికొట్టింది. పాకిస్తాన్లో గల తొమ్మిది ఉగ్రస్తావరాలపై భారత్ సైన్యం మెరుపు దాడి చేసింది. దీనిపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో జై హింద్ నినాదాలతో భారత సైన్యానికి అభినందనలు తెలుపుతున్నారు.. ఆపరేషన్ సింధూర్ పాక్ ఉగ్రవాదులకు దడ పుట్టించిందని సినీ తారలు సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెడుతున్నారు. భారత పౌరులు సైతం ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నారు.. అయితే భారత్ చేసిన దాడిపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సీపీఐ నారాయణ కామెంట్స్..
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో సీపీఐ నారాయణ ఒక వీడియో ని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడిని వ్యతిరేకించారు. అలాగే వారిపై భారత చేసిన దాడిని సమర్థించలేనంటూ ఆ వీడియోలో చెప్పారు. ఉగ్రవాదులను చంపడం, యుద్ధం చేయటం రెండూ వేర్వేరు అని అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలి కానీ.. దానికి దేశాల మధ్య యుద్ధం అంతిమ పరిష్కారం కాదని పేర్కొన్నారు. పాక్ సైతం ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలని, ఆ విషయంలో భారత్ కు సహకరించాలని అన్నారు.. యుద్ధం అంటే ఉగ్రవాదులకు మరింత బలాన్ని ఇచ్చినట్లే అవుతుందని అలా చేయడం వల్ల మరిన్ని ప్రమాదాలు కొని తెచ్చుకోవడమే జరుగుతుందని ఆయన అన్నారు. సీపీఐ నారాయణ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆయన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు.. తాజాగా టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ ఆయన వీడియో పై స్పందించారు..
Also Read :ఇంతకి ఆ రింగ్ ఏమైంది.. చేప ఏమైంది..? చిరుకు చరణ్ క్వశ్చన్..
సీపీఐ నేత పై విరుచుకుపడ్డ నటుడు..
సీపీఐ ముఖ్యనేత నారాయణ ఆపరేషన్ సింధూరపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ దానిపై స్పందించారు.. భారత్ ఆర్మీ చేసిన పనికి సెల్యూట్ కొట్టాల్సిందే.. అంత మంచి పని చేసినందుకు మనందరం గర్వించాలి కానీ కొందరు మాత్రం ఇలా మాట్లాడడం ఏంటో అంటూ ఆయన సీరియస్ అయ్యాడు. భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీ ఎయిర్ పోర్స్, నేవీ కలిసి స్ట్రైక్ చేశాయి. ఇది ఫెంటాస్టిక్ న్యూస్. జై భారత్. జై హింద్. వందేమాతరం. కానీ ఇందులో ఎవడో ఒకడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎట్లా పుడతార్రా మీరు.. అంటూ సీపీఐ నారాయణపై శ్రీకాంత్ అయ్యంగార్ మండిపడ్డారు. ఎవడు అడిగాడురా నిన్ను.. పోరా పాకి నా కొ**కా.. ఫాల్తు అంటూ తీవ్ర పదజాలంతో దూషించాడు.. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం మన దేశ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని ముందుకు సాగాలని సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి దీనిపై సీపిఐ నారాయణ ఎలా స్పందిస్తారో చూడాలి..