Steam Side Effects: ఆవిరి పీల్చడం అనేది శ్వాసకోశ సమస్యలు, జలుబు, దగ్గు, సైనస్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలకు సాధారణంగా ఉపయోగించే ఒక సాంప్రదాయ చికిత్స. ఇది సాధారణంగా సురక్షితమైన పద్ధతిగా పరిగణించబడినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో దీని వల్ల నష్టాలు కూడా ఉంటాయి. తరచుగా ఆవిరి తీసుకున్నా ప్రమాదమే అని డాక్టర్లు చెబుతున్నారు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. చర్మం కాలడం:
ఆవిరి తీసుకున్న సమయంలో చర్మం కాలడం వంటివి కూడా జరుగుతుంటాయి. ఆవిరి చాలా వేడిగా ఉంటే.. అది ముఖం, ముక్కు లేదా ఇతర సున్నితమైన చర్మ భాగాలను డ్యామేజ్ చేస్తుంది. ఈ ప్రమాదం ముఖ్యంగా పిల్లలు , వృద్ధులలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వారి చర్మం సున్నితంగా ఉంటుంది. వేడి నీటి పాత్రను తాకినా లేదా ఆవిరిని చాలా దగ్గర నుండి పీల్చడం వల్ల కూడా చర్మంపై కాలిన గాయాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇలాంటి సమస్యను నివారించడానికి.. నీరు ఎంత వేడిగా ఉన్నాయో చెక్ చేసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా కాస్త దూరంగా ఉండి మాత్ర ఆవిరిని పీల్చడం ముఖ్యం.
2. శ్లేష్మ పొరలకు హాని:
అతిగా వేడి ఆవిరిని పీల్చడం వల్ల ముక్కు లేదా గొంతులోని శ్లేష్మ పొరలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది పొడిబారడం, చికాకు లేదా కొన్ని సందర్భాల్లో రక్తస్రావం వంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యలు సాధారణంగా తాత్కాలికమైనవి అయినప్పటికీ.. భవిష్యత్తులో శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. ఈ దుష్ప్రభావాన్ని నివారించడానికి.. ఆవిరి తీసుకునే నీటి ఉష్ణోగ్రతను తగిన విధంగా ఉంచడం. ఆవిరి తీసుకునే సమయాన్ని 10-15 నిమిషాలకు పరిమితం చేయడం మంచిది.
3. మైకము లేదా తలతిరగడం:
కొందరు వ్యక్తులు ఆవిరి తీసుకునే సమయంలో మైకం లేదా తలతిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. సాధారణంగా ఆవిరి వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు తాత్కాలికంగా మారడం లేదా అధిక వేడి వల్ల జరుగుతుంది. ఈ సమస్య ముఖ్యంగా రక్తపోటు సమస్యలు లేదా శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆవిరి పీల్చడం ఆపి, సాధారణ గాలిలో శ్వాస తీసుకోవాలి.
4. అలెర్జీలు లేదా చికాకు:
అలర్జీ సమయంలో కొందరు ఔషధాలు లేదా ఎసెన్షియల్ ఆయిల్స్ నీటిలో కలుపుతారు. ఇవి కొందరిలో అలెర్జీలను లేదా శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది. ఉదాహరణకు.. యూకలిప్టస్ ఆయిల్ కొందరిలో దద్దుర్లు, శ్వాస ఆడకపోవడం లేదా కళ్ళలో నీరు కారడం వంటి సమస్యలను కలిగించవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి.. కొత్త పదార్థాలను ఉపయోగించే ముందు వాటిని తక్కువ మోతాదులో పరీక్షించడం మంచిది.
Also Read: ఉసిరి ఇలా వాడితే.. తల మోయలేనంత జుట్టు
5. ఇన్ఫెక్షన్ వ్యాప్తి ప్రమాదం:
స్టీమ్ ఇన్హేలేషన్ కోసం ఉపయోగించే పరికరాలు లేదా నీరు శుభ్రంగా లేకపోతే.. బ్యాక్టీరియా లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. ఉదాహరణకు.. స్టీమర్ లేదా పాత్రలోని నీరు క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే.. అది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. అంతే కాకుండా ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి.. శుభ్రమైన నీటిని , శుభ్రపరిచిన పరికరాలను మాత్రమే ఉపయోగించాలి.
6. ఆస్తమా లేదా శ్వాసకోశ సమస్య:
ఆస్తమా లేదా ఇతర దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారిలో స్టీమ్ ఇన్హేలేషన్ కొన్నిసార్లు లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు. అధిక వేడి ఆవిరి శ్వాసనాళాలను ఇబ్బంది పెడుతుంది. దీనివల్ల శ్వాస ఆడకపోవడం లేదా దగ్గు పెరగడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి.ఈ వ్యాధులు ఉన్నవారు స్టీమ్ ఇన్హేలేషన్ చేసే ముందు వైద్యుడిని సంప్రదించాలి.