Big Stories

Kadapa Politics: అన్న, తమ్ముడు Vs అక్క , చెల్లి

Kadapa Politics YS Jagan , Avinash Vs Sharmila , Sunitha: వైఎస్ కుటుంబసభ్యుల ప్రచారంతో కడప ఎన్నికల రాజకీయం వేడెక్కిపోతుంది. వివేకా కుమార్తె సునీత ఇప్పటికే కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తున్నారు. తన తండ్రి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిపై కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న షర్మిలను గెలిపించాలని పిలుపు ఇస్తున్నారు. జగన్ మాత్రం అవినాష్ ఏ తప్పు చేయలేదంటూ తన చెల్లిళ్లను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. మరోవైపు ఇప్పటికే కడపలో ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసిన పీసీసీ షర్మిల రాష్ట్ర ప్రచారానికి వెళ్లి తిరిగిరానున్నారు. ఆ క్రమంలో కడప పాలిటక్స్ ఉత్కంఠ రేపుతున్నాయి.

- Advertisement -

కడప జిల్లా పాలిటిక్స్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సెంట్రిక్‌గా తిరుగుతున్నాయి. వివేకా హత్య కేసు విచారణ సీబీఐ పరిధిలోకి వెళ్లడంతో దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం రెండుగా చీలిపోయింది. సీఎం జగన్‌, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ ప్రత్యర్ధులుగా మారి ఎన్నికల్లో తలపడుతున్నారు. తన తండ్రి వివేకా హత్య కేసులో ఐదేళ్లుగా న్యాయం జరగలేదని. హత్యకు కారణమైన నిందితుడు అవినాష్‌ను రక్షించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని వైఎస్ సునీత ఆరోపిస్తున్నారు. షర్మిలకు మద్దతుగా సునీత ప్రజల్లో తిరుతూ వైసీపీని ఓడించాలని కోరుతున్నారు.

- Advertisement -

Also Read: జగన్ వ్యాఖ్యలు.. ముమ్మాటికీ అవాస్తవం

కడప పార్లమెంటు స్థానానికి షర్మిల కాంగ్రెస్‌ పార్టీ నుంచి తలపడుతుండగా వైసీపీ నుంచి వైఎస్‌ అవినాష్‌రెడ్డికి తిరిగి టికెట్ ఇచ్చారు జగన్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌రెడ్డిని రక్షించడమే కాకుండా తిరిగి అభ్యర్థిగా రంగంలోకి దింపడాన్ని జీర్ణించుకోలేని షర్మిల. తన అన్న జగన్‌తో పాటు అవినాష్‌రెడ్డిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే కడప నియోజకవర్గంలో ఓసారి పర్యటించిన షర్మిల పీసీసీ అధ్యక్షురాలి హోదాలో రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి వెళ్లారు. జగన్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ రాష్ట్రమంతా తిరుగుతున్నారు.

షర్మిల రాష్ట్ర టూర్ పూర్తి చేసుకుని మే నెల 1న తిరిగి కడప నియోజకవర్గానికి చేరుకుని పోలింగ్‌ పూర్తయ్యేవరకు అక్కడే మకాం వేస్తారంటున్నారు. షర్మిలకు మద్దతుగా ప్రచారానికి రాహుల్‌గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వేర్వేరు సమయాల్లో రానున్నట్లు కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. ఇప్పటికే సునీత ఆమెకు మద్దతగా ఊరూవాడా ప్రచారం చేస్తున్నారు. వివేకా హ్యతకేసును ప్రస్తావిస్తూ తన బ్రదర్స్‌కు సవాళ్లు విసురుతున్నారు.

షర్మిల, సునీతల ప్రభావంతో వైసీపీ ఓట్లు చీలి పోతాయన్న గుబులు ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తుంది.. దానికి తగ్గట్లుగానే కాంగ్రెస్‌ పార్టీపైనా, పరోక్షంగా షర్మిలపై ఈ నెల 25న పులివెందుల సభలో సీఎం జగన్‌ బహిరంగంగా విమర్శలు చేశారు. చెల్లెళ్లను ఒక రేంజ్లో టార్గెట్ చేశారు.

అటు అన్న తమ్ముళ్లు జగన్, అవినాష్‌లపై యుద్దం ప్రకటించిన అక్కాచెల్లెళ్లు షర్మిల, సునీతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరు చాలదన్నట్లు వైఎస్ ఫ్యామిలీకి చెందిన మరింత మంది ప్రచారరంగంలోకి దిగుతుండటం ఆసక్తికరంగా మారింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News