Kakinada TDP : కాకినాడ జిల్లాలో టీడీపీ నేతపై హత్యాయత్నం కలకలం రేపింది. తుని టీడీపీ నేత, పొల్నాటి శేషగిరిరావుపై హత్యకు కుట్ర జరిగింది. భవానీమాల వేషంలో వచ్చిన దుండగుడు శేషగిరిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ దాడిలో శేషగిరిరావు చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు….ఆస్పత్రికి తరలించారు. హత్యాయత్నంకు పాల్పడింది ఎవరు అనేదానిపై విచారణ సాగుతోంది.