E-Paper
Advertisement

సముద్రంలోకి అంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే!

సముద్రంలోకి అంత ఉప్పు ఎక్కడి నుంచి వచ్చింది? దీని వెనక ఉన్న సైన్స్ ఇదే!
Advertisement

Sea Water Salinity: చిన్నప్పటి నుంచి మనందరినీ వేధించే ఒక క్రేజీ ప్రశ్న “నదులన్నీ తీపి నీటితోనే ప్రవహిస్తాయి కదా, మరి అవన్నీ వెళ్లి కలిసే సముద్రం నీరు మాత్రం ఎందుకు అంత ఉప్పగా ఉంటుంది?”. సముద్రంలో ఎవరో టన్నుల కొద్దీ ఉప్పు తెచ్చి కలపలేదు కదా! నిజానికి, మనం తాగే నది నీటిలోనే ఆ ఉప్పు దాగుంది. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మరి నదిలోని మంచి నీరు సముద్రంలోకి వెళ్లాక అంత ఉప్పగా ఎలా తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

సముద్రపు నీరు ఉప్పగా మారడం వెనక ఒక పెద్ద నేచురల్ రీసైక్లింగ్ ప్రాసెస్ ఉంది. ఇందులో నదులు, వర్షం, రాళ్లు, సూర్యుడు.. ఇలా అన్నింటి పాత్ర ఉంది.

Advertisement

1. వర్షం,రాళ్లు:

కథ అంతా ఆకాశం నుంచి పడే వర్షంతో మొదలవుతుంది. వాతావరణంలో ఉండే కార్బన్ డైయాక్సైడ్ వర్షపు నీటితో కలవడం వల్ల వర్షం నీరు స్వల్పంగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ వర్షం భూమిపై… ఉన్న కొండలు, బండరాళ్లపై పడినప్పుడు.. ఆ ఆమ్ల గుణం వల్ల రాళ్లు నెమ్మదిగా కరుగుతాయి. రాళ్లలో ఉండే సోడియం, క్లోరైడ్ వంటి ఖనిజ లవణాలు అయాన్లుగా విడిపోయి నీటిలో కలుస్తాయి.

Advertisement

2. నదులే ఉప్పును మోసుకొస్తాయి:
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. రాళ్ల నుంచి విడుదలైన ఆ లవణాలన్నింటినీ మన నదులే ప్రవహిస్తూ సముద్రంలోకి తీసుకెళ్తాయి. “మరి నదులు ఉప్పును మోసుకెళ్తే.. నది నీరు ఉప్పగా ఎందుకు ఉండదు?” అనే డౌట్ రావచ్చు. నిజానికి నది నీటిలో కూడా ఉప్పు ఉంటుంది, కానీ దాని పరిమాణం చాలా చాలా తక్కువ. మన నాలుక ఆ స్వల్ప ఉప్పదనాన్ని గుర్తించలేదు కాబట్టి మనకు నది నీరు తీపిగా అనిపిస్తుంది.

3.భాష్పీభవనం:
కోట్లాది సంవత్సరాలుగా నదులు ఇలా లవణాలను తెచ్చి సముద్రంలో పోస్తూనే ఉన్నాయి. సముద్రంలో పడిన నీటిపై సూర్యరశ్మి పడినప్పుడు.. కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే ఆవిరి అయి ఆకాశంలోకి వెళ్లి మళ్లీ మేఘాలుగా మారుతుంది. కానీ, నదులు తెచ్చిన ఉప్పు (సోడియం క్లోరైడ్) మాత్రం ఆవిరి కాకుండా సముద్రంలోనే ఉండిపోతుంది.

ఒక గ్లాస్ నీటిలో చెంచా ఉప్పు కలిపి, ఎండలో పెడితే.. నీరంతా ఆవిరైపోయి చివరకు గ్లాస్ అడుగున ఉప్పు మిగిలిపోతుంది కదా! సముద్రంలో కూడా బిలియన్ల సంవత్సరాలుగా సరిగ్గా ఇదే జరుగుతోంది. నీరు వస్తుంది, ఆవిరైపోతుంది.. కానీ ఉప్పు మాత్రం అక్కడే పోగవుతూ వస్తోంది.

4. సముద్రం లోపలి అగ్నిపర్వతాలు:
కేవలం నదులే కాకుండా, సముద్రం అడుగున ఉండే ‘హైడ్రోథర్మల్ వెంట్స్’, నీటి లోపల బద్దలయ్యే అగ్నిపర్వతాలు కూడా సముద్రంలోకి భారీగా ఖనిజాలను, లవణాలను విడుదల చేస్తాయి. ఇవి కూడా సముద్రపు నీటి ఉప్పదనాన్ని మరింత పెంచుతాయి.

ఈ లవణాల్లోని సోడియం, క్లోరిన్ కలిసి మన వంటింట్లో.. వాడే సాధారణ ఉప్పుగా మారుతాయి. సముద్రంలో ఉండే మొత్తం ఉప్పును తీసి భూమిపై పరిస్తే.. ఒక 40 అంతస్తుల భవనం అంత ఎత్తున భూమినంతటినీ కప్పేయవచ్చట.

నదులు తెచ్చే కొద్దిపాటి లవణాలు, సూర్యుడి వేడి వల్ల జరిగే ఎవాపరేషన్ ప్రాసెస్ వల్లే సముద్రం అంత ఉప్పగా తయారవుతుంది. ప్రకృతి చేసే ఈ అద్భుతమైన సైన్స్ వల్లే భూమిపై వాటర్ సైకిల్ బ్యాలెన్స్‌డ్‌గా సాగుతోంది.

 

Tags

Related News

నచ్చిన ఆహారం తింటూ.. కిలో బరువు తగ్గాలంటే.. రోజుకు ఎన్ని అడుగులు నడవాలి?

గుంటూరు స్పెషల్ కోవా పూరీ..ఇంట్లోనే ఇలా చేస్తే స్వీట్ షాప్ టేస్ట్!

వంకాయ నువ్వుల రోటి పచ్చడి..ఈ స్టైల్‌లో చేస్తే ప్లేట్ మొత్తం ఖాళీ!

పర్ఫెక్ట్ రాయలసీమ స్టైల్ ఉగ్గాని..ఒక్కసారి తింటే వదిలిపెట్టరు!

రొమ్ము క్యాన్సర్ ఈ దశకు చేరితే ఏం జరుగుతుంది? ప్రతి మహిళ తెలుసుకోవాల్సిందే!

నోటికి కారంగా, సూపర్ టేస్టీగా ఆలూ పచ్చి కారం ఫ్రై!

నెల రోజులపాటు నిల్వ ఉండే రవ్వ లడ్డు..క్షణాల్లోనే చేయండిలా!

సేమియా ఉప్మా బోర్ కొట్టిందా? ఇలా ఎగ్ సేమియా ట్రై చేయండి!

Big Stories

Advertisement
×