E-Paper
Advertisement

పోతే పోనీ పోరా.. చెల్లే లేద‌నుకోరా..! కానీ టీఆరెస్‌ను మాత్రం వ‌దులుకోం..!

పోతే పోనీ పోరా.. చెల్లే లేద‌నుకోరా..! కానీ టీఆరెస్‌ను మాత్రం వ‌దులుకోం..!
Advertisement

లంకేశ్వ‌రుడు సినిమాలో అనుకుంటా ఈ పాట‌. పోతేపోనీ పోరా.. చెల్లే లేద‌నుకోరా..! అయామ్ మ్యాడ్‌.. ఎస్ అయామ్ మ్యాడ్‌..! అని చిరంజీవి సాంగ్‌. అక్క‌డ సెంటిమెంట్ ప్ర‌ధానంగా.. చెల్లెతో బంధాన్ని తెంపులేక‌.. ఆ బాధ‌ను భ‌రించ‌లేక‌.. వాన‌లో త‌డుస్తూ పిచ్చిప‌ట్టిన‌వాడిలా చిరు పాడుకునే స్యాడ్ సాంగ్‌.

ఇక్క‌డ అచ్చంగా కేటీఆర్ కూడా ఇట్ల‌నే అన్నాడు. కానీ రివ‌ర్స్‌లో. బంధాలు తెంచుకున్నా కించుత్తు బాధ‌ప‌డ‌లేదు. పీడా విర‌గ‌డైంద‌ని అనుకుంటున్నాడు. త‌న చెల్లె గురించి. చెల్లె గిల్లే జాన్తా నై. పోతే పోయింది. ర‌క్త సంబంధం క‌న్నా మాకు.. రాజ‌కీయ‌మే ముఖ్యం.. మా టీఆరెస్ మాక్కావాలంతే..! అని క‌రాఖండిగా చెప్పేశాడు.

Advertisement

త‌న మ‌న‌సులోని మాట ఇలా చెప్పేశాడు ఇన్నాళ్ల‌కు. ఇదీ నీ నిజ స్వ‌రూపం సామీ..!అని రంగ‌స్థ‌లం సినిమాలో విల‌న్ ప్ర‌కాశ్ రాజ్‌తో రామ్ చ‌ర‌ణ్ చెప్పే డైలాగును గుర్తు తెచ్చాడ‌నుకో రామ‌న్నా! అవును.. ఆ టీఆరెస్ మాదే మేము ప‌దేళ్లు పాలించినామ‌న్నాడు. క‌ష్ట‌ప‌డి దాన్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లామ‌ని గుర్తు చేసుకున్నాడు. మ‌రి పార్టీ మార్పు ఎందుకు చేశారో చెప్ప‌లేదు. ఇదీ నా కాలే.. అదీ నా కాలే..! అని పుష్ప సినిమాలో అల్లు అర్జున్ డైలాగులా.. ఆ టీఆరెస్ మాకే..ఈ బీఆరెస్సూ మాదే అన్నాడు.

ఎట్లా వ‌దులుకుంటాం.. అవ్ మేమే అభ్యంత‌రాలు చెప్పినం.. బాజాప్తా! అది మా హ‌క్కు..! అని పిడికిలెత్తి విప్ల‌వ వీరుడి వ‌లె ఎలుగెత్తి చాటాడు. మ‌రి ఆ చెల్లె కూడా ఆ కుటుంబంలోంచే క‌దా వ‌చ్చింది. ఆ పార్టీలోనే క‌దా భాగ‌స్వామ్య‌మైంది! అంద‌రితో పాటు ఆమే ఉద్య‌మాలు చేసింది క‌దా? ఆ పార్టీ కోసం కేసుల పాలైంది క‌దా? పార్టీ జ‌నాధర‌ణ‌లో ఆమె పాత్ర కూడా ఉంది క‌దా? అనే ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు లేదు.

Advertisement

పితృస్వామ్య వ్య‌వ‌స్థ‌లో.. వార‌సత్వం కొడుక్కే వ‌స్తుంది గాని బిడ్డెకు వ‌స్తుందా? పార్టీ ప‌గ్గాలు కొడుక్కే ఇస్తారు గానీ బిడ్డెకు ఇస్తారా? పార్టీ ఫండ్ కొడుకు చేతిలో పెడ‌తారు కానీ.. బిడ్డెకు పంచుతారా? కూడ‌బెట్టిన ఆస్తులు కొడుకు క‌ట్ట‌బెడ‌తారు గానీ బిడ్డెకు కూడా వాటా ఇస్తారా? ఇచ్చిత్రం కాక‌పోతే.. క‌విత అడుగుడే త‌ప్పు.

పాపం.. వారు ఎంతో  క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న పార్టీ పేరును అలా టూకీగా.. ఈజీగా.. చ‌టుక్కున గుంజుకుపోతే ఎట్లా భ‌రిస్తారు? మ‌రి ఆమెను ఉన్న‌ప‌ళంగా క‌ట్టుబ‌ట్ట‌ల‌తో బ‌య‌ట‌కు మెడ‌బ‌ట్టి గెంటేస్తే ఎట్లా భ‌రిస్తుంది? భ‌రించాలె. ఎదురు తిరిగిన‌ప్పుడు భ‌రించాలె. లేదంటే సైలెంట్ గా ప‌డి ఉండాలె. ఇదెట్లా..? అదెట్లా..? అలా ఉండాలె.. చెప్పి చెయ్యాలె.. బుద్దిగా ఉండాలె.. ఇట్లా నడుచుకోవాలె..! అని నీతులు చెప్పించుకునేందుకా.. ?

అందుకే పార్టీ లేదు.. పార్టీ ప‌ద‌వులు లేవు. అధికారం లేదు. ఆస్తులు లేవు. బంధం లేదు. ర‌క్తం స‌బంధం లేదు.. కేవ‌లం రాజ‌కీయం. అదీ కొడుకు కోస‌మే. అన్నీ కొడుకు కోస‌మే. కొడుకు కొడుకు కోస‌మే. కొడుకును సీఎం చేయ‌డం కోస‌మే. కొడుకు కొడుకునూ సీఎం చేయ‌డం కోస‌మే. అందుకే పోతే పోనీ పోరా.. బిడ్డే లేద‌నుకోరా.. ! అని కేసీఆర్ కూడా ఎప్పుడో పాడేశాడు పాట‌. తెంపేసుకున్నాడు బంధాన్ని. అది ర‌క్త సంబంధ‌మైతే ఏందీ..? రాజ‌కీయం ముందు.

Related News

ఏం వాడ‌క‌మ‌య్యా సామీ!? పోక్సో కేసును ఒక‌రిలా.. ఒక‌ర‌లా…! ఒక‌ర్నిమించి మ‌రొక‌రు..!

ల‌క్కీ నెంబ‌ర్‌, ఆషాఢ మాసం.. మంచి ముహూర్తం..! అచ్చం కేసీఆర్ లెక్క‌నే..! కేటీయారే భిన్నం..

పోక్సో..పై పొరుగోళ్లు కూడా నీతులే! రేవంత్‌కు ప‌వ‌న్ లేఖ‌.. పాత‌బ‌స్తీ ప్ర‌స్తావ‌న ఎందుకో మ‌రి…?

ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

ర‌ద్దు నోళ్లు మూత‌ప‌డ్డ‌ట్టేనా? ఫ్యూచ‌ర్ సిటీపై బీఆరెస్ ర‌చ్చ‌కు అమెజాన్ బ్రేక్‌..!

ఫ్యూచ‌ర్ సిటీ సిగ‌లో అమెజాన్ క‌లికితురాయి..! భారీ పెట్టుబ‌డుల‌కు శ్రీ‌కారం..!

ఢిల్లీ ఇంజ‌న్ స‌ర్కార్‌.. తెలంగాణ‌!

Big Stories

Advertisement
×