Telugu web series: లైఫ్ ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ఎవ్వరికీ తెలియదు. మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, బౌండరీస్ అన్నీ ఒక్కసారిగా మారిపోతూ ఉంటాయి. అలాంటి టైమ్ లో బతుకు భారంగా అన్పిస్తుంది. ఆ టైమ్ లో చేసే పనులే మన లైఫ్ జర్నీని నిర్ణయిస్తాయి. అలాంటి ఒక హార్ట్ టచింగ్ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఇదొక ఇండిపెండెంట్ తెలుగు వెబ్ సిరీస్. ‘షిఫ్టింగ్ హారిజన్స్’ (Shifting Horizons) అనే టైటిల్ తో రూపొందిన ఈ సిరీస్ ను ఫ్రీగా ఎక్కడ చూడవచ్చు ? ఎన్ని ఎపిసోడ్లు ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఎపిసోడ్ 1 : Decision
మొదటి ఎపిసోడ్ లో కథ మన అందమైన హీరోయిన్ తో స్టార్ట్ అవుతుంది. ఆమెకు తన బావ అంటే చాలా ఇష్టం. బావ-మరదళ్ల మధ్య ఉండే ఆ అపారమైన ప్రేమ, అవగాహన, గౌరవం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. ఇక ఈ జంట తమ లోకంలో సంతోషంగా ఉంటారు. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో, వీళ్ళ జీవితంలో ఒక అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ పరిస్థితుల్లో, లాక్‌డౌన్ భయాల మధ్య భవిష్యత్తు గురించిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది.
ఎపిసోడ్ 2 : Conflict
ఇక్కడి నుండి స్టోరీ మరింత ఎమోషనల్ గా మారుతుంది. కోవిడ్ వల్ల పరిస్థితులు దారుణంగా మారతాయి. ఆక్సిజన్ కొరత, హాస్పిటల్ లో బెడ్స్ లేకపోవడం, ఒంటరిగా పోరాడుతున్న వ్యక్తుల కథలు… ఈ సీన్లే హీరోయిన్ జీవితంలో రిపీట్ అవుతాయి. అదే సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుడు, 23 ఏళ్ల వయసున్న ఒక యువకుడు అనూహ్యంగా ప్రాణాలు కోల్పోతాడు. ఆ ఆకస్మిక మరణం స్రవంతిని తీవ్రమైన గుండెకోతకు గురి చేస్తుంది. భర్త, కుటుంబం, సమాజం… అందరూ ఆమెను ఆ దుఃఖం నుంచి బయట పడేయడానికి ప్రయత్నిస్తారు. కానీ అది సాధ్యం కాదు.
ఎపిసోడ్ 3 : Resilience
ఇదే సిరీస్ లో చివరి ఎపిసోడ్. అంతటి శోకాన్ని, బాధను స్రవంతి ఎలా అధిగమించింది అనేది ఈ ఎపిసోడ్ స్టోరీ. కోవిడ్ కష్టాలను ఈ సిరీస్ కళ్ళకు కడుతుంది.
2026 జూలైలో విడుదలైన ఈ సిరీస్లో, కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో ఒక యువతి ఎదుర్కొన్న సమస్యలను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారు. అవినాష్ ధరిపల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ 3 ఎపిసోడ్ సిరీస్‌లో స్రవంతి ప్రత్తిపాటి, రిషి కౌశిక్ ప్రధాన పాత్రలు పోషించారు. దీన్ని ఓటీటీలో ఉచితంగా చూడవచ్చు. PoV-creations యూట్యూబ్ ఛానల్‌లో తెలుగు ఆడియోతో అందుబాటులో ఉంది.
Read Also: 40 రోజులు నలుగురు పిల్లలు మిస్సింగ్… అమెజాన్ అడవుల్లో అదిరిపోయే అడ్వెంచర్