Big Stories

Karnataka: జగన్ ‘నవరత్నాలు’.. కాంగ్రెస్ ‘పంచరత్నాలు’.. సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీలు!

- Advertisement -

Karnataka: ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టో అత్యంత కీలకం. గెలిస్తే ఏం చేస్తామో.. ఎలాంటి పథకాలు అమలు చేస్తామో.. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తామో.. రాసిచ్చే హామీల చిట్టా. ఒకప్పుడు మేనిఫెస్టో పేరుతో పేజీలకు పేజీలు.. పుస్తకంగా అచ్చేసేవారు. రాసినోళ్లు తప్ప ఆ మేనిఫెస్టోను చదివేవాళ్లే ఉండరు. అవి అసలు ప్రజలకు అందుబాటులోనూ ఉంచరు. ఏదో రిలీజ్ చేశామంటే చేశాం.. అన్నట్టు ఉండేది మేనిఫెస్టో తంతు. కానీ, ఆ స్ట్రాలజీని కంప్లీట్‌గా మార్చేశారు వైసీపీ అధినేత జగన్. పుస్తకాలు లేవు.. సోది బాగోతాలు లేవు. సింపుల్.. 9 అంటే 9 హామీలు. అంతే. నవరత్నాల పేరుతో.. కేవలం తొమ్మిది హామీలతో ఎన్నికలకు వెళ్లింది వైఎస్సార్‌సీపీ. 9 హామీలే కావడంతో అంతా ఈజీగా గుర్తుపెట్టుకున్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది జగన్‌కు కలిసొచ్చింది. అధికారం కట్టబెట్టింది. సేమ్ అలాంటి స్ట్రాటజీనే.. కర్నాటకలో కాంగ్రెస్ సైతం అమలు చేసింది. వైసీపీలానే ఘన విజయం సాధించింది.

- Advertisement -

అవును, కర్నాటకలో కాంగ్రెస్ విజయానికి అనేక కారణాలు ఉన్నా.. ఆ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ కార్డు హామీలే అన్నిటికంటే ఎక్కువగా ఓటర్లను ఆకర్షించాయి. చాటభారతంలా అనేక హామీలు గుప్పించలేదు ఆ పార్టీ. సింపుల్‌గా.. ఐదంటే ఐదు హామీలు ఇచ్చింది. గ్యారెంటీగా అమలు చేసి తీరుతామంటూ ప్రామిస్ చేసింది. ఐదు హామీలే కాబట్టి.. ప్రజలు వాటికి ఫిక్స్ అయిపోయారు. చేతి గుర్తుపై ఓట్లు గుద్దేశారు.

హస్తం పార్టీ మేనిఫెస్టోలో పంచశీల వ్యూహాన్ని నమ్ముకుంది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువనిధి, శక్తి.. ఈ ఐదు హామీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టి జనంలోకి వెళ్లింది కాంగ్రెస్ పార్టీ. అనుకున్న లక్ష్యాన్ని సాధించింది.

గృహజ్యోతి హామీలో ఇంటికి 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఇస్తామన్నది కాంగ్రెస్. అలాగే కన్నడిగులను ఆకట్టుకున్న మరో స్కీం… గృహలక్ష్మి. ఈ హామీ ప్రకారం ప్రతి ఇంట్లో మహిళకు నెలకు 2 వేలు ఇవ్వనున్నారు. ఇక అన్న భాగ్య పథకం కింద దారిద్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో చాలా మందికి బియ్యం, రాగులు, జొన్నలు, మిల్లెట్ వంటి వాటిని ఉచితంగా ఇస్తారు. ఎంపిక చేసుకున్న10 కిలోల ఆహార ధాన్యాలను ఫ్రీగా అందిస్తారు.

యువతను ఆకట్టుకున్న మరో హామీ.. యువ నిధి. తాము అధికారంలోకి వస్తే డిగ్రీ చదివిన నిరుద్యోగులకు నెలకు 3 వేల రూపాయలు ఇస్తామన్నారు. అలాగే డిప్లొమా హోల్డర్స్ కు నెలకు 1500 నిరుద్యోగ భృతిగా ఇస్తామని ప్రకటించారు. ఇది కూడా కాంగ్రెస్ కు యూత్ కనెక్ట్ చేయడంలో ఉపయోగపడింది. KSRTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి హామీ ఇచ్చింది కాంగ్రెస్. ఇలా పంచశీల వ్యూహంలో భాగంగా అన్ని వర్గాల ఓటర్లను కాంగ్రెస్ పార్టీ టచ్ చేసింది. బీజేపీని కోలుకోలేని దెబ్బ కొట్టింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News