Big Stories

Kirankumareddy comments: ఆయన కోమాలో ఉన్నారా? ఇకపై ఆటలు సాగవు

Kiran kumar reddy comments on Peddireddy(AP elections news): ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ ఏపీలో రాజకీయ నేతల మధ్య మాటలు హద్దులు దాటుతున్నాయి. అంతేకాదు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రాజంపేట బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి. ఆయన సొంతూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా కాగా, అదే నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ మిథున్‌రెడ్డి వైసీపీ తరపున బరిలో ఉన్నారు. ముఖ్యనేతలిద్దరూ చిత్తూరు నేతలు కావడంతో వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారు.

- Advertisement -

రాజంపేట నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించారు మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి. అక్రమాస్తుల కేసులో జగన్‌ అరెస్టుకు తాను కారణమని మంత్రి పెద్దిరెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఇన్నాళ్లు ఆయన కోమాలో ఉన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో నిద్రలేచారా అంటూ ఎద్దేవా చేశారు. నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలవుతుందనే శాపం పెద్దిరెడ్డికి వుందని, అందుకే ఆయన అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

- Advertisement -

పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆటలకు ఫుల్‌స్టాప్ పడుతుందన్నారు కిరణ్‌కుమార్ రెడ్డి. తన పరిశ్రమల కోసం మామిడి, పాల రైతులకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నియోజక వర్గంలో అక్రమ మైనింగ్ సాగుతోందన్నారు.

ALSO READ: అవినాష్‌కు కష్టాలు! రేవంత్‌.. ఆ బాండ్స్‌తో సంబంధం లేదు

వైసీపీ నుంచి పెద్దిరెడ్డి కొడుకు మిథున్‌రెడ్డి రాజంపేట అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కొడుకు తరపున పెద్దిరెడ్డి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఒకసారి గెలిచిన మిథున్‌రెడ్డి, మరోసారి రాజంపేటపై వైసీపీ జెండా ఎగురవేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎత్తుకుపై ఎత్తులు వేస్తూ నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News