Big Stories

Sarvepalli Politics: సర్వేపల్లి కె.జి.ఎఫ్‌ క్లైమాక్స్ అదిరేనా?

- Advertisement -

ఏది జరిగినా మన మంచికే.. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుందని సహజంగా అంటుంటారు. ఈ నానుడు రాజకీయాల్లోనూ వినిపిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కూడా ఎక్కడా కుంగిపోకుండా పార్టీ శ్రేణులను నడిపిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ కంచుకోటగా చెప్పుకునే నెల్లూరు జిల్లాలో ఈసారి మాత్రం వైసీపీపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారిందా అంటే. అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక దొరికిందే ఛాన్స్ అని ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. చంద్రబాబు వరుస పర్యటనలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పని ఉంటూ పార్టీ క్యాడర్లో నూతన జోష్ నింపుతున్నారు.

- Advertisement -

నెల్లూరు జిల్లాలో తొలి నుంచి కాంగ్రెస్ పార్టీ హవా కొన‌సాగిన‌ప్ప‌టికీ వైసీపీ ఏర్ప‌డ్డ‌ప్ప‌టి నుంచి ఆ పార్టీ ఇక్క‌డ కీల‌కంగా మారింది. కానీ ఈసారి మాత్రం టీడీపీ బలం గట్టిగా ఉండడంతో వైసీపీ కంచుకోటని బద్దలు కొట్టేందుకు చూస్తోంది. జిల్లాలోని బడా నేతలు అందరిని ఆకర్ష్ పథకం కింద టీడీపీ గూటికి చేరేలా చేయడంలో టీడీపీ సక్సెస్ అయ్యింది. కీలక నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం ఇప్పుడు టీడీపీ నుంచి బరిలో ఉన్నారు. దాంతో ఈసారి ఏదేమైనా తాడోపేడో తెలుసుకునేందుకు సై అంటే సై అంటున్నారు టీడీపీ నేతలు. టీడీపీకి సపోర్ట్ గా బీజేపీ, జనసేన కూడా ఆయుధాలను సంధిస్తూ తోడవడంతో చంద్రబాబు వైసీపీ ప్లాన్స్ కి పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు.

Also Read: అవినాష్‌కు కష్టాలు! రేవంత్‌.. ఆ బాండ్స్‌తో సంబంధం లేదు

ప్రజాగళం పేరిట వరుసగా పర్యటనలు చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ ముఖ్య నేతలంతా సైకిల్ ఎక్కేయడంతో.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఛాన్స్ మిస్ చేసుకొను అంటూ బాబు ప్లాన్స్ వేస్తున్నారు. అందుకు గాను నిన్న ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో పర్యటించారు చంద్రబాబు. ముందుగా గూడూరులో ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా ఆయన మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 14 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా తాను ఏం చేశానో చెబుతూనే భవిష్యత్తులో ఏం చేయబోతున్నాను కూడా చంద్రబాబు మహిళలకు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు. దీంతో నియోజకవర్గ మహిళల్లో సైతం కొత్త జోష్ నెలకొంది. అలానే ఈ మీటింగ్ కి గూడూరు, వెంకటగిరి, నాయుడుపేట, సూళ్లూరుపేట నుంచి కూడా పార్టీ ప్రముఖ నాయకులు ఇక్కడకి రావడం పార్టీకి ప్లస్ గా మారింది.

అదే స్పీడ్ లో సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో కూడా చంద్రబాబు పర్యటన సాగింది. ముందుగా రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. కేజిఎఫ్ 1, కేజీఎఫ్ 2 సినిమా ధియేటర్లలో చూస్తే కేజిఎఫ్ త్రీ మాత్రం సర్వేపల్లి లో చూడవచ్చని సెటైర్లు వేశారు. మైనింగ్ మాఫియాతో వైసీపీ నేత ఫుల్ గా దోచుకుంటున్నారని బాబు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వరుస పర్యటనలతో గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో కాస్త స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్లో కదలికలు వచ్చాయని అభిప్రాయపడుతున్నారు.

Also Read: మడకశిరలో మడతపేచి..

అలానే వైసీపీలో అభ్యర్థుల‌ను ఎదుర్కోవ‌డం కోసం టీడీపీ గెలుపు గుర్రాల‌పై దృష్టి పెట్టి అభ్యర్థులను ప్రకటించారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంతో పాటు అధికార పక్ష నాయకులను దీటుగా ఎదుర్కొంటూ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. ఈ నూతన ఉత్తేజం ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు కురిపిస్తాయా అంటే కాదనలేని పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు స్తబ్దుగా ఉన్న టీడీపీ క్యాడర్. చంద్రబాబు పర్యటనలతో జోష్ తెచ్చుకుంది. ఇక వైసీపీ ప్రధాన లీడర్లు టీడీపీలోకి రావడంతో గెలుపు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరి వైసీపీ వ్యతిరేకతతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలంతా టీడీపీ లోకి రావడం వరుస పర్యటనలతో చంద్రబాబు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపడమే కాకుండా..అధికార పార్టీ నేతలపై వాగ్భాణాలు సందిస్తూ దూసుకుపోవడం చూస్తుంటే నెల్లూరు జిల్లాలో టీడీపీ ఈసారి గట్టిగా విక్టరీ కొడుతుందా ? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News