BigTV English

Kodali Nani : గుడివాడ పాలిటిక్స్.. బాబు ఫైర్.. కొడాలి కౌంటర్..

Kodali Nani : గుడివాడ పాలిటిక్స్.. బాబు ఫైర్.. కొడాలి కౌంటర్..

Kodali Nani News(AP Political Updates) : టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిని ఎలాగైనా ఓడించేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గుడివాడలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఇదే సమయంలో కొడాలి నానిపై విమర్శలు గుప్పించారు. మహనీయుడు ఎన్టీఆర్‌ నడయాడిన గడ్డను అరాచకాలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. బూతుల ఎమ్మెల్యే తులసి వనంలో గంజాయి మొక్కలా తయారయ్యారని మండిపడ్డారు. రాజకీయ భిక్ష పెట్టాం. ఇప్పుడు చరిత్రహీనులుగా మారారు. గుడివాడను పేకాట క్లబ్బులుగా మార్చారు. క్యాసినోలు తెచ్చారు. భూకబ్జాలు, ఇసుక మాఫియా, మట్టి మాఫియా.. అన్నీ అరాచకాలే. అభివృద్ధి పట్టదు. నోరు విప్పితే బూతులే. అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే తేల్చండి అంటూ కొడాలి నానిని ఉద్దేశించి చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును తెలుగు జాతి గర్వించేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.


వైసీపీ ప్రభుత్వంపైనా చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నాలుగేళ్లుగా బాదుడే.. బాదుడు ఉంది. పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌, మద్యం ధరలు పెరిగాయి. మూడు రాజధానులతో జగన్‌ మూడు ముక్కలాట ఆడుతున్నారు. దేశంలో ధనిక ముఖ్యమంత్రి సీఎం జగన్‌ అని నివేదికలు చెబుతున్నాయి. 2004లో జగన్‌ ఆస్తులు ఎంత? ఇప్పుడెంత? అని ప్రశ్నించారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌ ప్రకారం వైఎస్ఆర్ కుటుంబం ఆస్తి 1.7 కోట్లు. ఇప్పుడు 29 రాష్ట్రాల సీఎంల ఆస్తి రూ. 505 కోట్లు అయితే.. ఒక్క ఏపీ సీఎం ఆస్తి అంతకన్నా ఎక్కువే ఉందని అన్నారు. జగన్‌ ఏం చేసి రూ. 510 కోట్లు సంపాదించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అసలే చంద్రబాబుపై చెలరేగి విమర్శలు చేసే కొడాలి నాని.. తన నియోజకవర్గానికి వచ్చి ఆరోపణలు చేయడంతో తిరిగి మరింత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బాబు చేసిన ప్రతి విమర్శకు దీటుగా సమాధానం ఇచ్చారు. నిమ్మకూరులో తాను, జూనియర్‌ ఎన్టీఆర్‌ కలిసి ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టామన్నారు. తాము పెట్టిన విగ్రహాలకు ఇప్పుడు చంద్రబాబు నివాళులు అర్పించారని అన్నారు. ఎంపీగా ఉన్నప్పుడు హరికృష్ణ రూ. 14 కోట్లతో నిమ్మకూరును అభివృద్ధి చేశారని తెలిపారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడకు ఏం చేశారు? అని నిలదీశారు.


చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతిసారి గుడివాడలో టీడీపీ ఓడిందని కొడాలి నాని గుర్తు చేశారు. చంద్రబాబు నిమ్మకూరులో బస చేయడంపై సెటైర్లు వేశారు. 42 ఏళ్ల తర్వాత అత్తారింటికి వెళ్లి పడుకున్నారని విమర్శించారు. గుడివాడలో 23 వేల మందికి ఇళ్లు ఇస్తున్నామని తెలిపారు. పేదల ఇళ్ల కోసం చంద్రబాబు ఎకరం కొన్నట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ చేశారు. సీఎం జగన్ ఆస్తులపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. చంద్రబాబు భార్య ఆస్తులను కలిపి ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. చంద్రబాబు ఎంతమందిని కలుపుకున్నా వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని కొడాలి నాని స్పష్టం చేశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×