BigTV English

Koneti Adimulam Victim: నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..! ఆదిమూలం బాధితురాలు సంచలన మెసేజ్

Koneti Adimulam Victim: నేను ఆత్మహత్య చేసుకుంటున్నా..! ఆదిమూలం బాధితురాలు సంచలన మెసేజ్

Koneti Adimulam Victim Shocking Message: సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బాధితురాలు మరోసారి వార్తల్లో నిలిచింది. తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారంటూ ఆత్మహత్య చేసుకుంటానని వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెట్టింది. నాకు జరిగిన అన్యాయం మీ అక్క మీ చెల్లికో జరిగితే నాపై ఇలాంటి కామెంట్స్ చేయరంటూ తెలిపింది. అందుకే నేను చనిపోతున్నా అంటూ మెసేజ్ లు పెట్టడంతో మరోసారి అలజడి రేగింది. అంతే కాదు తనకు టీడీపీ నాయకులు ఎవరూ సహకరించడం లేదని.. అందుకే ఇక అందరికీ సెలవు అంటూ పోస్ట్ పెట్టింది. మరోవైపు కోనేటి ఆదిమూలం గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు.


రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఆదిమూలం రొమాంటికి టేప్స్ కేసులో కలకలం రేపుతున్న నేపథ్యంలో ఆదిమూలం బాధితురాలు గురువారం సాయంత్రం తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె శుక్రవారం నాడు పరీక్షలకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అయితే అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టింది. సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి మీడియా గ్రూపుల్లో.. తనకు పార్టీ నాయికులు ఎవరు సహకరించడంలేదు. మీ చెల్లికో.. అక్కకో.. జరిగి ఉంటే ఇలా మీరు కామెంట్స్ చేస్తారా అంటూ.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక మెసేజ్ గ్రూపులో పెట్టింది. అయితే ఆమె ప్రస్తుతం ఏపీలో లేదు. హైదారాబాద్‌లో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

Also Read: ఏపీలో ఓ ఎమ్మెల్యే రాసలీలలు.. కావాలనే కుట్ర..


మొత్తంమీద ఆ వీడియోల బయటకు వచ్చిన తర్వాత పరస్పర ఆరోపణలు టీడీపీ గ్రూపులతో పాటు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఆమె గురించి కొంతమంది అనుకూలంగా.. మరికొంత మంది వ్యతిరేకంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం  రాత్రి ఈ విధంగా మీడియా గ్రూపులో మెసేజ్ పెట్టింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ కొనసాగుతోంది. స్థానికంగా ఆమె చెబుతున్న హోటల్ సంబంధించిన సీసీ పుటేజ్‌లు పోలీసులు సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నతాధికారులు ఈ కేసు విషయంపైన ప్రత్యేక శ్రద్ధతో కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×