BigTV English

Kotamreddy: వైసీపీ నుంచి పోటీ చెయ్యను.. దానిపై ఆదాల స్పష్టత ఇవ్వాలి: కోటంరెడ్డి

Kotamreddy: వైసీపీ నుంచి పోటీ చెయ్యను.. దానిపై ఆదాల స్పష్టత ఇవ్వాలి: కోటంరెడ్డి

Kotamreddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ పార్టీల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ప్రతిరోజూ కోటంరెడ్డి ఏదోవిధంగా వైసీపీ పార్టీపై ఉన్న అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కోటంరెడ్డి.. రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేయనని స్పష్టం చేశారు.


తన తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుందని అన్నారు. మేయర్ సహా 11 మంది కార్పోరేటర్లు తనవెంట ఉన్నారని తెలిపారు. పార్టీవైపు వెళ్లినవారు .. రాజకీయంగానే కాదని.. మానసికంగా తనకు దగ్గరగా ఉన్నారని వెల్లడించారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని చెబుతున్నారని.. వేల కోట్ల ఆస్తులున్న ఆదాలతో పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నాని వెల్లడించారు. తాను ఎవరినీ శత్రువుగా భావించనని.. పోటీ దారుగానే భావిస్తానని చెప్పుకొచ్చారు.

గతంలో మాదిరిగా ఆదాల అన్నిపార్టీలకు తిరగొద్దని సూచించారు. ఏ పార్టీలో ఉంటున్నారో.. ఏ పార్టీ నుంచి పోటీచేయబోతున్నారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ బీఫామ్ జేబులో పెట్టుకొని.. జగన్‌ను కలవడానికి వెళ్లాడని విమర్శించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని కేంద్ర హోంశాఖకు లేఖ రాశానని తెలిపారు. అలాగే అవకాశం వస్తే నేరుగా కలిసి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.


Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×