E-Paper
Advertisement

Ganja Seized: గుట్టుచప్పుడు కాకుండా.. కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు.. పోలీసులకు డౌట్ రావడంతో…?

Ganja Seized: గుట్టుచప్పుడు కాకుండా.. కంది, మిరప పంటల మధ్య గంజాయి సాగు.. పోలీసులకు డౌట్ రావడంతో…?
Advertisement

Ganja Seized:  కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం డేగులపాడు గ్రామంలో భారీగా సాగు చేస్తున్న గంజాయి తోటను పోలీసులు, ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేశారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మారుమూల గ్రామంలో దేవాదాయ శాఖకు చెందిన సుమారు 8 ఎకరాల మాన్యం భూమిలో, కంది, మిరప పంటల మధ్య అంతర పంటగా ఈ గంజాయిని సాగు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

డేగులపాడు గ్రామానికి చెందిన ఉనేబాది శివయ్య అనే రైతు గత నాలుగేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ అక్రమ సాగును కొనసాగిస్తున్నాడని తెలిపారు పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య. స్థానిక కూలీలను పొలం వైపు రాకుండా బెదిరిస్తుండటంతో అనుమానం వచ్చిన పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 4.96 కేజీల ఎండు గంజాయితో పాటు, దాదాపు 300 పచ్చి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని ట్రాక్టర్ల ద్వారా తరలించారు.

Advertisement

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై ఈగల్ టీమ్స్ నిఘా పెంచాయని, ఈ భారీ సాగు వెనుక ఎవరెవరు ఉన్నారో కూలంకషంగా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు డీఎస్పీ వెంకట రామయ్య. ఈ ఆపరేషన్‌లో సీఐ రవిశంకర్ రెడ్డి, ఎక్సైజ్ సీఐ లలితా దేవి, ఎస్సైలు సతీష్, మన్మధ విజయ్ తదితరులు పాల్గొన్నారు.

ALSO READ: Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×