E-Paper
Advertisement

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?
Advertisement

విద్యార్థుల్లో పరీక్షల ఒత్తిడిని తగ్గించి.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న వినూత్న కార్యక్రమం ‘పరీక్షా పే చర్చ’.. దీనికి సంబంధించిన తొమ్మిదో ఎడిషన్ నిర్వహణకు రంగం సిద్ధమైంది. 2026 జనవరిలో జరగనున్న ఈ ముఖాముఖి కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా భారీ స్పందన లభిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రికార్డు స్థాయిలో మొత్తం 1,27,38,536 మంది రిజిస్టర్ చేసుకున్నారు.

ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. మొత్తం దరఖాస్తుదారుల్లో విద్యార్థుల సంఖ్యే అధికంగా ఉంది. సుమారు 1,18,22,663 మంది విద్యార్థులు, 8,04,094 మంది ఉపాధ్యాయులు, 1,11,779 మంది తల్లిదండ్రులు ఇప్పటివరకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. జనవరి 2026లో జరగనున్న ఈ ప్రధాన కార్యక్రమంలో ప్రధాని మోదీ విద్యార్థులతో నేరుగా మాట్లాడి.. పరీక్షల భయాన్ని ఎలా అధిగమించాలో సూచనలు చేయనున్నారు.

Advertisement

6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు అవుతారు. ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 11, 2026 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు నేరుగా తమ వివరాలతో (Self-participation) లేదా తమ ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా పేరు, ఫోన్ నంబర్ ఉపయోగించి రిజిస్టర్ చేసుకోవచ్చు. నమోదు చేసుకున్న అభ్యర్థులందరికీ ప్రభుత్వం నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అందజేయనున్నారు.

ఈ కార్యక్రమం కోసం పార్టిసిపెంట్లను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఒక మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ (MCQ) పోటీని నిర్వహిస్తోంది. MyGov పోర్టల్ (https://innovateindia1.mygov.in/) వేదికగా ఈ పోటీ జనవరి 11 వరకు కొనసాగుతుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ వేదిక ద్వారా ప్రధానిని అడగాలనుకునే ప్రశ్నలను సమర్పించవచ్చు. ఎంపిక చేసిన ప్రశ్నలను ప్రధాన కార్యక్రమం రోజున ప్రధాని మోదీకి అడిగే అవకాశం కల్పిస్తారు.

Advertisement

పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ పరీక్షా పే చర్చను ఏటా నిర్వహిస్తున్నారు. దీని మొదటి ఎడిషన్ 2018 ఫిబ్రవరిలో ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి ఏడూ బోర్డు పరీక్షలకు ముందు ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. విద్యార్థుల సందేహాలను తీరుస్తూనే.. చదువును ఒక పండుగలా ఎలా జరుపుకోవాలో మోదీ ఈ వేదిక ద్వారా చక్కగా వివరిస్తారు.

ALSO READ: Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. మంత్రులకు ర్యాంకులు.. ఎవరు టాప్ అంటే

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×