E-Paper
Advertisement

జగన్ ఓపెనైపోయారు.. రావణ్ బంధువులతో మాజీ సీఎం మాటలు, గన్నవరం ఎయిర్‌పోర్టులో సన్నివేశం

జగన్ ఓపెనైపోయారు.. రావణ్ బంధువులతో మాజీ సీఎం మాటలు, గన్నవరం ఎయిర్‌పోర్టులో సన్నివేశం
Advertisement

Gannavaram Airport: యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారంలో నెక్ట్స్ ఏం జరగబోతోంది? పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయా? రేపో మాపో అరడజను మందిని అరెస్ట్ చేసే అవకాశముందా? ఈ విషయంలో ఆయనకు వైసీపీ ఓపెన్‌గా మద్దతు ఇచ్చిందా? రావణ్ బంధువులతో జగన్ నేరుగా మాట్లాడారు.

గన్నవరం ఎయిర్‌పోర్టులో సన్నివేశం-యూట్యూబర్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై వైసీపీ ఓపెన్ అయిపోయింది. రావణ్ అరెస్టుకు ముందు పెద్ద డ్రామాగా క్రియేట్ చేసింది ఆ పార్టీ. ఎప్పుడైతే ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేశారో ఆయనతో మాకు సంబంధం లేదంటూ తేల్చిచెప్పారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Advertisement

ఈ క్రమంలో గురువారం బనగానపల్లిలో సీఎం చంద్రబాబు నోరు విప్పారు. మతాల గురించి నీచంగా మాట్లాడిన వ్యక్తికి గొడ్డలి పార్టీ ఆర్థికసాయం చేసిందని తేల్చేశారు. రౌడీలు-సంఘ విద్రోహ శక్తులను ప్రొత్సహించవద్దని పదే పదే ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.

రావణ్ బంధువులతో జగన్ మాటలు, ఆపై మద్దతు-శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో రావణ్ కొలీగ్ గగనను కలిశారు జగన్. ఎయిర్‌పోర్టు లోపలికి వెళ్తున్న సమయంలో మల్లాది విష్ణు.. గగనను చూపించారు. దీంతో వెనక్కి వచ్చిన జగన్, గగనతో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. వైసీపీ ఎల్లప్పుడు మీకు అండగా ఉంటుందని, అవినాష్ మీకు టచ్‌లో ఉంటారంటూ భరోసా ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement

ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. రావణ్ విషయంలో నేతల మాటలు ఒకలా, వైసీపీ అధినేత జగన్ మాటలు మరొకలా ఉన్నాయని అంటున్నారు. ఈ విషయంలో ఆ పార్టీ నేతలకు శుక్రవారం ఊహించని షాక్ ఇచ్చారు జగన్. ప్రశ్న రావణ్ వెనుక ఉన్నది తామేనని చెప్పకనే చెప్పినట్లు అయ్యింది. దీంతో ప్రభుత్వానికి కొత్త అస్త్రం లభించినట్లయ్యింది.

అడ్డంగా బుక్కైన వైసీపీ నేతలు-కఠినమైన సెక్షన్లు, ఆధారాలు లభించడంతో రావణ్‌కు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అండగా ఉంటుందని చెప్పడం దేనికి సంకేతం? రావణ్ లాంటి వ్యక్తులను వైసీపీ ప్రొత్సహిస్తోందని అంటున్నారు. విశాఖ గూగుల్ డేటా సెంటర్ విషయంలో అప్పుడు కూడా ఆ పార్టీ నేతలు ఇలాగే బుక్కయ్యారు. నేతల వాయిస్ ఒకలా.. అధినేత మాట మరోలా ఉందని గుర్తు చేస్తున్నారు.

ALSO READ: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. ఐదు కేసులు నమోదు, మృతులపై క్లారిటీ 

ఇక ఈ కేసు విషయానికి వద్దాం. త్వరలో ఈ కేసుకు సంబంధించి దాదాపు అరడజను మంది అరెస్టు కావచ్చే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ వ్యవహారం వైసీపీలో ప్రకంపనలు రేపుతోంది. రానున్న రోజుల్లో రావణ్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

 

Related News

ఏకగ్రీవాలకు అంగీకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్.. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

జోగి రమేశ్ వ్యాఖ్యలపై కోడలు కౌంటర్.. సజ్జల కాలాయపన, గుట్టంతా బయటపెట్టిన మేఘన

Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్.. రిట్ పిటిషన్ డిస్మిస్, కనీసం వాదనలు వినేందుకు..

ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. శ్రీశైలంలో దారుణమైన ఘటన, అసలు ఏం జరిగింది?

ఈడీ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు.. కారుమూరి చుట్టూ ఉచ్చు, నెక్ట్స్ ఎవరో తెలుసా?

‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక

ఎవరిని బెదిరిస్తావ్.. నీ రెడ్ బుక్‌ను మడిచి పెట్టుకో!.. నారా లోకేష్‌పై జోగి రమేష్ ఫైర్!

తిరుపతిలో కలకలం.. హోంమంత్రి అనితపై పడ్డ డ్రోన్.. చేతికి గాయం!

Big Stories

Advertisement
×