E-Paper
Advertisement

తిరుమల దేవస్థానంలో ఉద్యోగాలంటూ.. రూ.3 కోట్లు స్వాహా, ఏకంగా టీటీడీ లోగోనే వాడేశాడు!

తిరుమల దేవస్థానంలో ఉద్యోగాలంటూ.. రూ.3 కోట్లు స్వాహా, ఏకంగా టీటీడీ లోగోనే వాడేశాడు!
Advertisement

TTD Scam: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం అంటే సమాజంలో ఉండే గౌరవమే వేరు. సరిగ్గా నిరుద్యోగుల్లో ఉండే ఇదే బలహీనతను ఆసరాగా చేసుకున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి. తాను ఒక న్యాయవాదిని అని పరిచయం చేసుకుంటూ, టీటీడీ ఉన్నతాధికారులతో తనకు బలమైన పరిచయాలు ఉన్నాయని నమ్మబలికాడు. ముఖ్యంగా టీటీడీ జీఎం సుబ్రహ్మణ్యం ద్వారా సులభంగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నకిలీ నెట్‌వర్క్ సృష్టించి వల విసిరాడు.

అన్యమత ఉద్యోగుల తొలగింపు.. అదే ఆయుధంగా!
ఇటీవల టీటీడీలో అన్యమత ఉద్యోగుల తొలగింపు అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగిన సంగతి తెలిసిందే. నిందితుడు కిరణ్ కుమార్ రెడ్డి ఈ అంశాన్ని తన మోసానికి ప్రధాన ఆయుధంగా వాడుకున్నాడు. అన్యమత ఉద్యోగులను తొలగించిన స్థానాల్లో కొత్తగా హిందువులను నియమిస్తున్నారని, ఆ కోటాలోనే మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అంతేకాదు, నమ్మకం కుదర్చడం కోసం టీటీడీ అధికారిక లోగోను ఉపయోగించి నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లను కూడా సృష్టించి బాధితులకు అందజేశాడు.

Advertisement

రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూళ్లు
ఈ నకిలీ పత్రాలను చూసి నిజమైన ఉద్యోగాలే అనుకుని బాధితులు లక్షలాది రూపాయలు నిందితుడి చేతిలో పెట్టారు. ఒక్కో అభ్యర్థి ఉద్యోగ స్థాయిని బట్టి రూ.15 లక్షల నుంచి ఏకంగా రూ.50 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా దాదాపు 25 మందికి పైగా నిరుద్యోగుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి డబ్బులు గుంజాడు. మొత్తం మీద ఈ కుంభకోణం విలువ ప్రాథమిక అంచనా ప్రకారం దాదాపు రూ.3 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

జాయినింగ్ పేరుతో కాలయాపన.. చివరికి
డబ్బులు తీసుకుని, నకిలీ పత్రాలు చేతిలో పెట్టిన తర్వాత.. విధుల్లో చేరే (జాయినింగ్) తేదీల విషయంలో నిందితుడు నెలల తరబడి కాలయాపన చేస్తూ వచ్చాడు. బాధితులు గట్టిగా నిలదీయడంతో పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు టీటీడీ కార్యాలయంలో విచారించగా, తాము మోసపోయామని, తమకు ఇచ్చినవన్నీ నకిలీ పత్రాలని గ్రహించి లబోదిబోమన్నారు. చివరకు బాధితులంతా కలిసి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Advertisement

Also Read: ఏపీలో భారీ ఆలయ చోరీ.. అర్ధరాత్రి చొరబడి కోట్లాది రూపాయల విగ్రహాలు మాయం!

Related News

ఏకగ్రీవాలకు అంగీకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఉండవ్.. వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

జోగి రమేశ్ వ్యాఖ్యలపై కోడలు కౌంటర్.. సజ్జల కాలాయపన, గుట్టంతా బయటపెట్టిన మేఘన

Supreme Court: వైసీపీకి సుప్రీంకోర్టులో ఝలక్.. రిట్ పిటిషన్ డిస్మిస్, కనీసం వాదనలు వినేందుకు..

ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. శ్రీశైలంలో దారుణమైన ఘటన, అసలు ఏం జరిగింది?

ఈడీ రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు.. కారుమూరి చుట్టూ ఉచ్చు, నెక్ట్స్ ఎవరో తెలుసా?

‘యువతులను ట్రాప్ చేస్తున్నారు’.. ఏపీ ప్రభుత్వానికి రాజాసింగ్ కీలక హెచ్చరిక

ఎవరిని బెదిరిస్తావ్.. నీ రెడ్ బుక్‌ను మడిచి పెట్టుకో!.. నారా లోకేష్‌పై జోగి రమేష్ ఫైర్!

తిరుపతిలో కలకలం.. హోంమంత్రి అనితపై పడ్డ డ్రోన్.. చేతికి గాయం!

Big Stories

Advertisement
×