BigTV English

Real Hero Pawan Kalyan : రియల్ హీరో పవన్ కల్యాణ్.. ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు, మోదీ

Real Hero Pawan Kalyan : రియల్ హీరో పవన్ కల్యాణ్.. ప్రశంసల వర్షం కురిపించిన చంద్రబాబు, మోదీ

Reel Hero to Real Hero Pawan Kalyan : రాజకీయాలంటే ఆషామాషీ కాదు.. సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీలే ఎన్నికల్లో చతికిల పడుతుంటాయి. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం పెద్ద ఎక్సర్‌సైజే చేయాలి. జనహృదయాలు దోచుకోవాలి. అవమానాలు భరించాలి. కష్టనష్టాలు ఎదుర్కొవాలి. ఓర్పు, నేర్పు ఉండాలి. ఎక్కడ తగ్గాలో తెలిసి ఉండాలి. అవసరమైనప్పుడు త్యాగాలు చేయాలి. అప్పుడే సక్సెస్ దరి చేరుతుంది. దానికి అసలు సిసలు నిదర్శనం పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్. అందుకే ఇప్పుడు ఏపీ ఎలక్షన్ మ్యాచ్‌లో బంపర్ విక్టరీ కొట్టిన కూటమి టీంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. ప్రమాణస్వీకారంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులందర్నీ ఊర్రూతలూగించారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌ని పణంగా పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో తన అన్నయ్యకు అండగా ప్రజారాజ్యం పార్టీ తరఫున 2008లో విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. అయితే ప్రజారాజ్యం పార్టీకి ప్రజల ఆశీర్వాదం దక్కలేదు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో, పవన్ రాజకీయాలకు దూరం అయ్యారు. అప్పుడు ఆయన పాలిటిక్స్‌లో రీ ఎంట్రీ ఇస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ప్రజాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. తిరిగి రాజకీయాల్లోకి రారని అంతా భావించారు.

పవన్ అందరి అంచనాలను తారుమారు చేశారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీలకి తన సంపూర్ణ మద్దతు తెలిపి అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు. అయితే.. 2019లో మాత్రం టీడీపీ నుంచి విడిపోయి సోలోగా పోటీ చేసి.. ఒక్క సీటుకే పరిమితమయ్యారు. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.


Also Read : ఏపీలో మారిన చిక్కీ కవర్లు.. జగనన్న గోరుముద్ద మాయం

ఇంకొకరైతే పార్టీ మూసేసి తమ పని తాము చూసుకునే వారేమో.. అయితే ప్రజాశ్రేయస్సును ఆకాంక్షించే విలక్షణ వ్యక్తిత్వమున్న పవన్ ఏపీలో జగన్ నియంత పాలనను తట్టుకోలేకపోయారు. తిరిగి కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని పట్టుబట్టి .. తిరిగి 2014 నాటి ఈక్వేషన్‌ని రిపీట్ చేయించారు. జగన్‌ను గద్దె దించడమే టార్గెట్‌గా పెట్టుకుని.. జనసేన సీట్ల విషయంలో త్యాగాలు చేశారు. జనసేనను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్‌రేట్‌తో గెలిపించుకోవడమే కాక.. కూటమి అఖండ విజయంలో తన వంతు పాత్ర పోషించారు. అందుకే చంద్రబాబు మాటకు ముందొకసారి తర్వాత ఒకసారి పవన్ పేరు కలవరిస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. 72,279 ఓట్ల భారీ మోజార్టీతో గెలిచి.. ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టి.. తన పవర్‌ఫుల్ జర్నీతో అందరికీ ఆదర్శంగా నిలిచారు. పవన్ కల్యాణ్‌ అనే నేను.. అంటూ జనసేనాని ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా.. పలు అరుదైన దృశ్యాలు అందరికీ కనువిందు చేశాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన అలాంటి సీన్ ఒకటి కార్యక్రమమం మొత్తానికి హైలెట్‌గా నిలిచింది.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులకు.. ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోడీ పవన్‌ కళ్యాణ్‌ చేయి పట్టుకుని అతిధులు ఉన్న వేదికపై ఉన్న పద్మవిభూషన్ చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి.. మరో వైపు పవన్ కళ్యాణ్.. ఉండగా మధ్యలో మోడీ నిల్చుకుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగస్టార్.. పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తించారు. అంతేకాదు మెగస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి పవన్ గడ్డం పట్టుకుని నవ్వుతూ పలకరించారు. అదంతా చూస్తూ మెగాస్టార్, పవర్ స్టార్ ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు.

Also Read : “చంద్రబాబు నాయుడు అనే నేను..” హోరెత్తిన సభా ప్రాంగణం

ఇక ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ అంతా విజయవాడ రావడం విశేషం. సభా ప్రాంగణానికి బస్సులో చేరుకున్న మెగా కుటుంబ హీరోలు ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘పవన్ కల్యాణ్‌గారి ప్రమాణ స్వీకారానికి పయనం’ అంటూ నిహారిక కొణిదెల చేసిన పోస్ట్‌లు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. వేదికపై ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ‘కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను’ అంటూ జనసేనాని ప్రమాణ స్వీకారం చేశారు. ‘కొణిదెల పవన్ కల్యాణ్‌ అనే నేను’ అనే మాట వినపడగానే సభా ప్రాంగణం కేరింతలతో దద్దరిల్లిపోయింది.

వేదికపై ఉన్న చిరంజీవి భావోద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరించిన పవన్ తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసి గౌరవాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా పవన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో వీడియో తీస్తూ మురిసిపోయారు.

అలాగే పవన్ కల్యాణ్‌ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. తమ తండ్రి ప్రమాణ స్వీకారోత్సవానికి పిల్లలు ఎలా తయారయ్యారో చూడండి’ అంటూ అకీరానందన్, ఆద్యలతో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న స్క్రీన్ షాట్ ను రేణుదేశాయ్ ఇన్ స్టాలో షేర్‌ చేశారు. మొత్తమ్మీద పవన్ అక్కడ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచి అందరి దృష్టిలో రియల్ హీరో అయ్యారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×