BigTV English
Advertisement

Lookout Notices To YCP Leaders: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో సజ్జలకు కష్టాలు.. అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, ఎందుకు?

Lookout Notices To YCP Leaders: ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో సజ్జలకు కష్టాలు.. అడ్డుకున్న ఇమిగ్రేషన్ అధికారులు, ఎందుకు?

Lookout Notices To YCP Leaders: చేసిన పాపాలు ఇప్పుడు కాకపోయినా.. కొద్దిరోజుల తర్వాతైనా వెంటాడుతాయని అంటున్నారు. ఈ సామెత వైసీపీ నేతలకు అతికినట్టు సరిపోతుందా? ఎందుకు వైసీపీ నేతలు భయపడుతున్నారు? విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? కేసుల విషయం తెలిసి తప్పించుకునేందుకు  స్కెచ్ వేస్తున్నారా? సజ్జలను ఎయిర్‌పోర్టులో అధికారులు ఆపడం వెనుక కారణమి దేనా? కేసుల ఉచ్చులో ఆయన ఇరుక్కున్నట్టేనా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


ఢిల్లీ ఎయిర్‌పోర్టులో వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. రెండురోజుల కిందట ఈ వ్యవహారం జరిగినట్టు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న సజ్జలపై లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆ నోటీసు నేపథ్యంలో సజ్జలను ఢిల్లీ ఎయిర్ పోర్టులో అధికారులు అడ్డుకున్నారన్నది వైసీపీ ఆరోపణ.

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం నిందితులుగా ఉన్నారు. కొంతమంది నిందితులను విచారించిన నేపథ్యంలో వారిచ్చిన సమాచారం ఆధారంగా సజ్జలను 120వ ముద్దాయిగా ఛార్జిషీటులో చేర్చారు. గతనెలలో మంగళగిరి పోలీసులు సజ్జలకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.


రెండురోజుల కిందట విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. దీనిపై సజ్జల వాదన మరోలా ఉంది. తాను విదేశాలకు వెళ్లలేదని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాను పర్యటిస్తున్నానని ఎందుకు అడ్డుకున్నారని ఎయిర్‌పోర్టు అధికారులను ప్రశ్నించారు.

ALSO READ: వానొచ్చేనంటే.. వరదొస్తది, ఏపీకి భారీ వర్ష సూచన.. కేబినెట్ భేటీ రద్దు?

విదేశాలకు వెళ్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని, దాన్ని ఆధారంగానే అడ్డుకోవాల్సి వచ్చిందన్నారు అధికారులు. దేశంలో ఎక్కడికి వెళ్లినా తమకు అభ్యంతరం లేదని, దానికి సంబంధించిన టికెట్లు వివరాలు ఇవ్వాలని కోరారు. దీంతో చిన్న వాగ్వాదం జరిగినట్టు అంతర్గత సమాచారం.

ఈ వ్యవహారంపై వైసీపీ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అండతో పిచ్చి కుట్రలు చేస్తూ వైయస్‌ఆర్‌సీపీ నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తోందని దుయ్యబట్టింది. ఇలాంటి రాజకీయాలు చేయడానికి సిగ్గు అనిపించలేదా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం సాధారణమని, రెండురోజుల కిందట జారీ చేయలేదన్నాయి. గత నెలలో సజ్జలకు లుక్ అవుట్ నోటీసు లు జారీ చేశామని అంటున్నాయి. కావాలనే కూటమి ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్నారని అంటున్నాయి.

కొద్దిరోజుల కిందట అమెరికా వెళ్లాలని సజ్జల నిర్ణయించారట. వైసీపీ కార్యకర్తల మాట మరోలా ఉంది. ప్రతీ ఏడాది సజ్జల విదేశాలకు వెళ్తారని, అందులో భాగంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు వెళ్లారని అంటున్నారు. ప్రస్తుతం సజ్జల హైదరాబాద్‌లో ఉన్నారు. మంగళవారం సాయంత్రం తాడేపల్లికి రానున్నారు. ఈ లెక్కన సజ్జల.. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకి వెళ్లడానికి కారణమేంటి అనేది తెలియాల్సివుంది.

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి.. మహిళకు గాయాలు

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Janasena X Account: జనసేన అధికారిక ‘ఎక్స్’ ఖాతా హ్యాక్.. వరుసగా అనుమానాస్పద పోస్టులు

Pawan Kalyan: కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించిన.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Nara Lokesh: బీహార్ ఎన్నికల్లో బీజేపీ తరపున మంత్రి నారా లోకేష్ ప్రచారం..

Kotamreddy Sridhar Reddy: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Ambati Logic: చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి ఉంటేనే మాకు లాభం.. అంబటి వింత లాజిక్

Big Stories

×