E-Paper
Advertisement

Sri Vishnu : “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్స్ న్యాయపోరాటం… రెండేళ్లు దాటినా పట్టించుకోని ప్రొడ్యూసర్

Sri Vishnu : “అల్లూరి” డిస్ట్రిబ్యూటర్స్ న్యాయపోరాటం… రెండేళ్లు దాటినా పట్టించుకోని ప్రొడ్యూసర్
Advertisement

Sri Vishnu : శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా నష్టాలపై తాజాగా డిస్ట్రిబ్యూటర్లు న్యాయ పోరాటానికి దిగారు. రెండేళ్లు దాటినా న్యాయం జరగలేదంటూ డిస్ట్రిబ్యూటర్స్ బోరుమంటున్నారు. పైగా నిర్మాత పట్టించుకోవట్లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బయ్యర్స్ కు భారీ నష్టాలు

Advertisement

శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘అల్లూరి’ సినిమా 2022 సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. అయితే అప్పటికే ‘అర్జున ఫాల్గుణ’, ‘భళా తందనాన’ వంటి సినిమాలతో ఘోర పరాజయం అందుకున్న శ్రీ విష్ణు… ‘అల్లూరి’ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని ట్రై చేశాడు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ దర్శకత్వం వహించగా, ఆయనకు దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. లక్కీ మీడియా బ్యానర్ పై నిర్మాత వేణుగోపాల్ బెక్కెం నిర్మించారు.

అల్లు అర్జున్ వచ్చినా… 

Advertisement

‘నిజాయితీ’కి మారు పేరు అనే ట్యాగ్ లైన్ తో రిలీజైన ఈ సినిమా ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా రావడంతో అప్పట్లో సినిమాపై అంచనాలు పెరిగాయి. మంచి బజ్ తో రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఈ మూవీకి 3. 42 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగగా, 3.7 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో థియేటర్లోకి దిగింది. కానీ ఈ మూవీ రన్ టైం పూర్తయ్యేసరికి భారీ నష్టాలతో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. కనీసం బ్రేక్ ఈవెన్ లో సగం కూడా రాబట్ట లేకపోయిన ఈ సినిమాకు ఫైనాన్షియల్ సమస్యలు ఎదురవ్వడంతో శ్రీ విష్ణు తన జేబులో నుంచి 2 కోట్లు పూచికత్తుగా పెట్టి సినిమాను రిలీజ్ చేయించారు. అయినప్పటికీ పెద్దగా కలిసి రాలేదు. ఎదురు డబ్బులు ఇచ్చి సినిమాను రిలీజ్ చేసినప్పటికీ ‘అల్లూరి’ డిజాస్టర్ గా మిగిలి అందరిని నిరాశపరిచింది.

సినిమాలోనే నిజాయితీ..  

అయితే సాధారణంగా ఇలాంటి భారీ డిజాస్టర్ ఎదురైనప్పుడు నిర్మాతలు బయ్యర్లను డబ్బులు వెనక్కి ఇచ్చి ఆదుకోవడం లాంటివి చేస్తారు. కానీ ‘అల్లూరి’ మూవీ విషయంలో మాత్రం ఇదేమి జరగలేదని తెలుస్తోంది. సినిమా రిలీజ్ అయ్యి రెండేళ్లు దాటిపోతున్నప్పటికీ నిర్మాత పట్టించుకోవట్లేదని తాజాగా ‘అల్లూరి’ డిస్ట్రిబ్యూటర్స్ న్యాయ పోరాటానికి దిగారు. దీంతో సినిమాను నిజాయితికి మారుపేరు అంటూ రిలీజ్ చేస్తే సరిపోతుందా? నిర్మాతలకు ఉండొద్దా నిజాయితీ అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు.

మరి ఇప్పటికైనా నిర్మాత దిగి వచ్చి బయ్యర్లను ఆదుకుంటాడా? శ్రీ విష్ణు ఈ విషయంపై స్పందిస్తాడా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన రీసెంట్ మూవీ ‘స్వాగ్’ కూడా పెద్దగా ఆడలేదు. కానీ శ్రీ విష్ణు ఈ మూవీకి వచ్చిన రెస్పాన్స్ పై స్పందిస్తూ కొన్నిసార్లు ప్రయత్నాలు చేసినా అవి ఫలించకపోవచ్చు. కానీ నెక్స్ట్ టైం మంచి స్ట్రాంగ్ కంటెంట్ తో డైరెక్టర్ ఆకట్టుకుంటారని ఆశిస్తున్నాను అంటూ కవర్ చేశారు. కానీ ఇప్పటిదాకా ‘అల్లూరి’ డిజాస్టర్ పై పెదవి విప్పలేదు. మరి రెండేళ్లు దాటిన ‘అల్లూరి’ నష్టాలపై హీరో స్పందించకపోవదానికి గల కారణం ఏంటో ఆయనకే తెలియాలి.

రోటీ కపడా రొమాన్స్ రిలీజ్ ఎఫెక్ట్…

లక్కీ మీడియా బ్యానర్ పై ప్రస్తుతం వస్తున్న మూవీ రోటీ కపడా రొమాన్స్. ఈ మూవీని అక్టోబర్ 25న రిలీజ్ చేయబోతున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన అల్లూరి బయ్యర్లకు న్యాయం చేయకుండా ఈ మూవీని ఎలా రిలీజ్ చేస్తారు అంటూ డిస్ట్రిబ్యూటర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి నష్టాలను సెటిల్ చేసిన తర్వాతే రోటీ కపడా రొమాన్స్ మూవీని రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్ ఛాంబర్ కి ఈ అల్లూరి నష్టాల పంచాయతీ వచ్చింది. అల్లూరి మూవీ నష్టాలను నిర్మాత సెటిల్ చేస్తాడా..? రొటీ కపడా రొమాన్స్ మూవీ రిలీజ్ కి లైన్ క్లియర్ అవుతుందో తెలియాలంటే మరి  కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×