E-Paper
Advertisement

అమెజాన్‌లో వైరల్ అవుతున్న 5 క్రేజీ ప్రొడక్ట్స్.. ఇవి ఇంట్లో ఉంటే లైఫే వేరు!

అమెజాన్‌లో వైరల్ అవుతున్న 5 క్రేజీ ప్రొడక్ట్స్.. ఇవి ఇంట్లో ఉంటే లైఫే వేరు!
Advertisement

Trending Amazon products India: సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. రీల్స్, షార్ట్స్‌లో రకరకాల అమెజాన్ ప్రొడక్ట్స్ ‘వైరల్’ అవుతూ కనిపిస్తాయి. చూడటానికి భలే క్రేజీగా ఉండే ఈ గ్యాడ్జెట్స్ , హోమ్ ప్రొడక్ట్స్ నిజంగానే పనికొస్తాయా? లేక కేవలం హైప్ మాత్రమేనా? అనే డౌట్ అందరికీ వస్తుంది. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే ఈ నెల అమెజాన్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతూ.. వంద శాతం వాల్యూ ఫర్ మనీ అనిపించే 5 బెస్ట్ వైరల్ ప్రొడక్ట్స్ లిస్ట్‌ను తీసుకొచ్చాం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ టాప్ 5 వైరల్ ప్రొడక్ట్స్:

ఈ రోజుల్లో స్మార్ట్‌గా బ్రతకడానికి స్మార్ట్ గ్యాడ్జెట్స్ చాలా అవసరం. అమెజాన్‌లో వేల ప్రొడక్ట్స్ ఉన్నా, ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 సూపర్ ప్రొడక్ట్స్ ఇవే..

1. మల్టీ-ఫంక్షనల్ ఎలక్ట్రానిక్ క్లీనింగ్ కిట్ :

Advertisement

మన ఫోన్ స్క్రీన్, ఇయర్‌బడ్స్ కేస్, లాప్‌ టాప్ కీబోర్డ్‌లలో రోజువారీగా చాలా దుమ్ము పేరుకుపోతుంది. వాటిని క్లీన్ చేయడానికి ఈ 8-in-1 క్లీనింగ్ కిట్ ప్రస్తుతం ఇన్స్టా గ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో.. ఉండే చిన్న బ్రష్‌లు, సాఫ్ట్ స్పాంజ్, కీబోర్డ్ కీ పుల్లర్ సహాయంతో మీ గ్యాడ్జెట్స్‌ను క్షణాల్లో కొత్తవాటిలా.. మెరిపించవచ్చు. పాకెట్ సైజ్‌లో ఉండే ఈ కిట్ ప్రతి ఒక్కరి దగ్గరా ఉండాల్సిన మస్ట్ హావ్ ప్రొడక్ట్.

2. మినిమలిస్ట్ పోర్టబుల్ జ్యూసర్ బ్లెండర్ :

హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్లకు, బ్యాచిలర్స్‌కు ఇది ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్. చూడటానికి ఒక స్టైలిష్ బాటిల్‌లా ఉండే ఈ బ్లెండర్ యూఎస్‌బీతో ఛార్జ్ అవుతుంది. మీరు ఆఫీస్‌లో ఉన్నా, జిమ్‌లో ఉన్నా లేదా ట్రావెలింగ్ చేస్తున్నా.. ఇందులో ఫ్రూట్స్ వేసి జస్ట్ ఒక్క బటన్ నొక్కితే చాలు, క్షణాల్లో ఫ్రెష్ జ్యూస్ లేదా స్మూతీ రెడీ అయిపోతుంది.

3. మోషన్ సెన్సార్ ఎల్‌ఈడీ లైట్లు:

Advertisement

రాత్రి పూట నిద్ర లేచినప్పుడు ఇంట్లో లైట్ల స్విచ్‌ల కోసం వెతకాల్సిన అవసరం లేకుండా చేసే క్రేజీ ప్రొడక్ట్ ఇది. ఈ చిన్న ఎల్‌ఈడీ లైట్లను వార్డ్‌రోబ్స్, మెట్లు, లేదా బెడ్‌రూమ్ గోడలకు ఈజీగా అంటించుకోవచ్చు. మనం వాటి వైపు వెళ్లగానే ఆటోమేటిక్‌గా వెలుగుతాయి. మనం పక్కకు వెళ్లగానే ఆరిపోతాయి. ఇవి రీఛార్జబుల్ కాబట్టి బ్యాటరీల ఖర్చు కూడా ఉండదు.

Also Read: క్రేజీ ఇయర్‌బడ్స్! కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో.. Nothing Ear (3a) లాంచ్

4. సిలికాన్ సక్షన్ ఫోన్ మౌంట్:

రీల్స్ చేసేవాళ్లకు, కార్ లేదా బైక్ డ్రైవ్ చేసేవాళ్లకు, కిచెన్‌లో ..వంట చేస్తూ వీడియోలు చూసేవాళ్లకు ఇది బెస్ట్ గ్యాడ్జెట్. ఈ సిలికాన్ మ్యాట్‌ను ఫోన్ వెనుక అంటించుకుంటే..అద్దం, టైల్స్, లేదా కారు విండ్‌స్క్రీన్‌కు మీ ఫోన్‌ను జస్ట్ అలా స్టిక్ చేసేయొచ్చు. ఎంత వైబ్రేషన్ వచ్చినా ఫోన్ అస్సలు కింద పడదు.

5. సిలికాన్ స్ట్రైనర్ అండ్ గ్రీజ్ ప్రొటెక్టర్ :

వంటగదిలో పనిని సగం చేసే సూపర్ ప్రొడక్ట్ ఇది. అన్నం లేదా పప్పు వండినప్పుడు నీటిని వంచడానికి గిన్నెపై దీన్ని స్నాప్ చేస్తే చాలు. ఒక్క మెతుకు కూడా కింద పడకుండా.. నీరు పర్ఫెక్ట్‌గా ఫిల్టర్ అవుతుంది. వేడిని తట్టుకునే సిలికాన్ మెటీరియల్‌తో దీన్ని తయారు చేశారు.

Related News

లైవ్ పెర్ఫామర్ల కోసం సోనీ సరికొత్త ఇయర్ మానిటర్స్.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

షాకింగ్ ఫీచర్.. ఐఫోన్‌కు పోటీగా మోటరోలా కొత్త ఫోన్.. బిల్ట్‌ఇన్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్‌తో ఎంట్రీ!

మార్కెట్లోకి Lumio 55-ఇంచ్ క్రేజీ స్మార్ట్ టీవీలు..థియేటర్ లెవెల్ సౌండ్, ఫీచర్స్ చూస్తే షాకే!

ఇక గ్రామాల్లోనూ అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్.. వైర్లు లేకుండానే 200 Mbps స్పీడ్, 5TB డేటాతో పాటు ఫ్రీ OTT!

క్రేజీ ఇయర్‌బడ్స్! కాల్ రికార్డింగ్ ఫీచర్‌తో.. Nothing Ear (3a) లాంచ్

ఛార్జింగ్ టెన్షన్‌కి గుడ్‌బై! కేవలం రూ.1,899కే.. Pebble 30000 mAh పవర్‌బ్యాంక్!

ఇంట్లో ఈ వాషింగ్ మెషీన్ ఉంటే..బట్టలు ఐరన్ చేయాల్సిన పనే లేదు!

Big Stories

Advertisement
×