BigTV English

Manoj Mounika: ‘ఏం మనసో, ఏం వరసో’.. మనోజ్‌-మౌనిక వెడ్డింగ్ సాంగ్ అదుర్స్..

Manoj Mounika: ‘ఏం మనసో, ఏం వరసో’.. మనోజ్‌-మౌనిక వెడ్డింగ్ సాంగ్ అదుర్స్..
manoj mounika song

Manoj Mounika: మంచు మనోజ్ వెడ్స్ భూమా మౌనిక. ఇటీవల జరిగిన సెలబ్రిటీ మ్యారేజ్. అత్యంత సన్నిహితుల మధ్యే జరిగింది. మంచు లక్ష్మీ అన్నీతానై వ్యవహరించి గ్రాండ్‌గా జరిపించింది తమ్ముడి పెళ్లి. వాళ్ల పెళ్లి ఎలా జరిగిందో.. ఎవరెవరు అతిథిలుగా వచ్చారో.. అనే ఆసక్తి మంచు, భూమా అభిమానుల్లో ఉంది. అందుకే, పెళ్లి తర్వాత, కాస్త రిలాక్స్ అయ్యాక.. లేటెస్ట్‌గా వారి వెడ్డింగ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫ్రేమ్ టు ఫ్రేమ్ ప్రతీ ముఖ్యమైన అంశాన్ని అందులో కవర్ చేసి చూపించారు.


పెళ్లికి ముందు వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలతో సాంగ్ స్టార్ట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

ఆ తర్వాత మంచు లక్ష్మీతో ఈవెంట్ ఓపెన్ అయింది.


మెహందీ ఫంక్షన్‌లో చిగురాకుపచ్చ కలర్ చీరలో సీతాకోకచిలుకలా మెరిసింది భూమా మౌనిక. మెహందీ ప్రోగ్రామ్‌లో మనోజ్ సందడి అంతాఇంతా కాదు.

ఆ తర్వాత నైట్ ఫంక్షన్. వెడ్డింగ్ రింగ్స్ ఈవెంట్. బ్లాక్ అండ బ్లాక్ డ్రెస్సుల్లో తళుక్కుమంది ఆ జంట. మౌనిక.. మనోజ్‌కు రింగ్ తొడిగి.. బుగ్గకు ముద్దుపెట్టడం.. మనోడు హుషారుగా చిందులేయడం.. వారెవా క్యా సీన్‌హై.

నెక్ట్స్ హల్దీ ఫంక్షన్. పెళ్లి కొడుకు, పెల్లి కూతురిని చేయడం.

మంచు లక్ష్మీ దగ్గరుండి నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని.

మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేశారు. వైఎస్ విజయమ్మ విచ్చేశారు. పైలెట్ రోహిత్‌రెడ్డి అటెండ్ అయ్యారు. ఇలా అతిథులందరినీ కవర్ చేస్తూ సాగింది ఆ వీడియో.

పెళ్లి తంతును సైతం సింపుల్‌గా చూపించారు. తలంబ్రాల షాట్ అదుర్స్. అసలే మనోజ్ ఫుల్ యాక్టివ్ కదా. ఒకేసారి వెండిపళ్లెం ఎత్తేసి.. మొత్తం తలంబ్రాలను ఒకేసారి మౌనిక తలపై పోయడం బాగుంది. అతిథులంతా గులాబీ పూల రేకులు చల్లడం.. బహుబాగుంది.

ఇక, బిందెలో నుంచి ఉంగరం తీసే తంతు. అక్కడా మనోజ్‌ చేతికే రింగు.

వెడ్డింగ్ సాంగ్ ఎండింగ్‌లో.. పైలోకాల నుంచి భూమా శోభా-నాగిరెడ్డి దంపతులు ఆశీర్వదిస్తున్నట్టు వారి ఫోటోతో ఎండ్ చేస్తూ వారిని గుర్తు చేశారు.

‘శివుని ఆజ్ఞ’ అంటూ ఎండ్ కార్డ్ వేసి క్లోజ్ చేయడం చూస్తుంటే.. ఈ పెళ్లి ఆ ముక్కంటి ఆజ్ఞతోనే అయిందనే మెసేజ్ ఇచ్చారు.

‘ఏం మనసో.. ఏం వరసో’ అంటూ అనంత శ్రీరామ్ రాసిన సాంగ్ అద్భుతంగా సాగింది. మనోజ్-మౌనికల పెళ్లి పాట మీరూ చూసేయండి…

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×