BigTV English

Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!

Modi : ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!


PM Modi US Visit Schedule(Latest political news in India): ప్రధాని మోదీ అమెరికా పర్యటన షెడ్యూల్ ఖరారైంది. జూన్‌ 20 నుంచి 23 వరకు మోదీ యూఎస్ లో పర్యటిస్తారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అధికారికంగా ప్రకటించింది.

జూన్‌ 21న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి మోదీ నేతృత్వం వహిస్తారు. జూన్‌ 21న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు యోగా సెషన్‌ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, వివిధ దేశాల రాయబారులు, దౌత్యవేత్తలు పాల్గొంటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏటా నిర్వహించాలని 9 ఏళ్ల క్రితం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మోదీ ప్రతిపాదించారు.


మోదీ జూన్‌ 22న వాషింగ్టన్‌లో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ తో భేటీ అవుతారు. అదే రోజు సాయంత్రం అధ్యక్షుడు బైడెన్‌, ప్రథమ మహిళ జిల్ బైడెన్‌ మోదీకి అధికారిక విందు ఇస్తారు. అంతకు ముందు అమెరికా కాంగ్రెస్‌ ఉభయ సభలనుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు.

జూన్‌ 23న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కలిసి మోదీకి ఆతిథ్యమిస్తారు. వాషింగ్టన్‌లో వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారు. పలు కంపెనీల సీఈవోలు, వివిధ రంగాల నిపుణులతో చర్చలు జరుపుతారు. ప్రవాస భారతీయులతోనూ మోదీ ముచ్చటిస్తారు.

అమెరికా నుంచి మోదీ ఈజిప్టు వెళతారు. జూన్‌ 24, 25 తేదీల్లో ఆ దేశంలో పర్యటన సాగుతుంది. ప్రధాని హోదాలో మోదీ ఈజిప్టు వెళ్లనుండటం ఇదే తొలిసారి.

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×