E-Paper
Advertisement

Road Accident: తాండూర్‌లో బస్సు లారీ ఢీ.. స్పాట్ లోనే 30 మంది!

Road Accident: తాండూర్‌లో బస్సు లారీ ఢీ.. స్పాట్ లోనే 30 మంది!
Advertisement

Road Accident: తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు కుదిపేస్తున్నాయి. నిన్నటి ఘటన మరవకముందే ఈ రోజు అదే రూట్‌లో మరో యాక్సిడెంట్ జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూర్ వద్ద లారీ , ఆర్టీసీ బస్సు ఢీ కొన్నాయి. గుల్బర్గా నుంచి తాండూరు వైపు వస్తుంది బస్సు.. కరణ్ కోట్ సమీపంలోని సాగర్ ఫ్యాక్టరీ వద్ద మలుపు లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ప్రయాణికులు డ్రైవర్‌ను సమీపంలోని హాస్పిటల్ కి తరలించారు. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగక పోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రయాణికులు తెలిపారు.  యాక్సిడెంట్ జరిగిన అనంతరం లారీ డ్రైవర్ పరార్ అయ్యాడు. ఈ రోడ్డులో ప్రమాదాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగడంతో వాహనదారులు తీవ్ర భయానికి గురవుతున్నారు. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

కొండాపై వేటుతో.. అసమ్మతికి చెక్ పడినట్లేనా?

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ట్యాక్సులు కట్టరా? వారి నెల జీతం ఎంత?

పోలవరం నీళ్లు ఎవరికి? డేటా సెంటర్‌కా.. సాగు అవసరాలకా?

మంత్రి పదవి పాయే.. కొండా నెక్ట్స్ ఎటు?

హిట్ అండ్ రన్.. బడాబాబులకు చట్టం వేరేనా?

ఆక్వా రైతులకు మేత షాక్

కూలుతున్న మంచు కొండలు.. డేంజర్‌‌లో నేపాల్

కర్నూలులో కదులుతున్న డీఎస్సీ డొంక

Big Stories

Advertisement
×