The Raja Saab: ప్రభాస్ (Prabhas)హీరోగా ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ (The Raja Saab)సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ ఐదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాలేదని తెలుస్తుంది. ఈ విషయంలో నిర్మాతలు అయోమయంలో ఉన్న నేపథ్యంలోనే ఈ సినిమా తరచూ వాయిదా పడుతుందని సమాచారం.
ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం స్పందిస్తూ ఈ వార్తలను ఖండిస్తూ.. జనవరి 9న ఈ సినిమా విడుదల కాబోతోదని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. అనుకున్న విధంగానే ఈ సినిమా జనవరి 9వ తేదీ సంక్రాంతి పండుగకు విడుదల అవుతూ రెట్టింపు సందడి చేయబోతుందని చిత్రబృందం తెలియచేశారు. ఇలా సినిమా యధావిధిగా విడుదల అవుతుంది అని సంతోషపడే లోపు అభిమానులకు రాజా సాబ్ టీం మరొక షాక్ ఇచ్చిందని తెలుస్తోంది.
ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నవంబర్ 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు ఇదివరకు ప్రకటించారు. అయితే తాజాగా ఈ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కూడా వాయిదా పడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తారని భావించినప్పటికీ ఆ రోజు కేవలం ఒక పోస్టర్ తో సరిపెట్టారు. నవంబర్ 5వ తేదీ మొదటి పాటను విడుదల చేస్తామని నిర్మాతలు అధికారకంగా వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఫస్ట్ సింగిల్ విడుదల వాయిదా పడినట్టు తెలుస్తుంది. ఇంకా ఈ పాటకు సంబంధించిన పనులు పూర్తికాని నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ప్రభాస్ కి జోడిగా ముగ్గురు హీరోయిన్లు..
ఇలా ఈ పాట విడుదల కూడా వాయిదా పడటంతో జనవరి 9వ తేదీ అనుకున్న విధంగానే ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతుందా? లేదా అనే అయోమయంలో అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కామెడీ త్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కు తాతయ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించబోతున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో వింటేజ్ ప్రభాస్ ని చూడబోతున్నామని స్పష్టం అవుతుంది. ఇక ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ సినిమా మరింత ఆలస్యం అవుతూ వస్తుందని, ఈ సినిమా కోసం మరింత నిరీక్షణ తప్పదని తెలుస్తోంది.
Also Read: AA22 ×A6: అల్లు అర్జున్ అట్లీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. కన్ఫామ్ చేసిన బన్నీ!