Bhatti Vikramarka : మంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మధిర నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. భట్టికి తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 2009లో తొలిసారిగా మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. గత అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ గానూ పనిచేశారు.
మల్లు భట్టి విక్రమార్క ప్రొఫైల్..
1990-92 పీసీసీ కార్యనిర్వాహక సభ్యుడు
2000–2003 పీసీసీ కార్యదర్శి
2007లో ఖమ్మం నుంచి ఎమ్మెల్సీగా విజయం
మధిర నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపు
2009-11 వరకు ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో చీఫ్ విప్
2011-14 వరకు ఏపీ డిప్యూటీ స్పీకర్
2019-23 వరకు సీఎల్పీ నేత