BigTV English

Minister Gummanuru Jayaram : వైసీపీకి మరో బిగ్‌షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా.. టీడీపీలో చేరి అక్కడి నుంచి బరిలోకి..

Minister Gummanuru Jayaram : వైసీపీకి మరో బిగ్‌షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా.. టీడీపీలో చేరి అక్కడి నుంచి బరిలోకి..

BIG Shock To YCP Gummanur Quits Party


Minister Gummanuru Jayaram Resigned to YSRCP(Political news in AP): కర్నూలు జిల్లాలో YCPకి బిగ్‌షాక్‌ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ రోజే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించి వైసీపీకి షాకిచ్చారు. మంత్రి పదవికి, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కర్నూల్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని సీఎం జగన్ చెప్పినందుకే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనకు ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేదని, టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం ఆయన స్పష్టం చేశారు.

కాగా.. అధికార వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటి వరకూ 9 లిస్టులు ప్రకటించిన అధిష్ఠానం సిట్టింగులను కాదని.. వారిని మరో నియోజకవర్గాలకు మార్చింది. అధిష్టానం తీరుతో విసిగిన వారంతా పార్టీని వీడుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో చేరుతున్నారు. కొంతకాలంగా ఆలూరు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యనాయకులతో పాటు ద్వితీయశ్రేణి నేతలంతా ముక్కుమ్మడి రాజీనామా చేస్తున్నారు.


read more: జగన్ ఓటమి ఖాయమన్న ప్రశాంత్.. విరుచుకుపడిన ఏపీ మంత్రులు

కాగా.. గుమ్మనూరు జయరాం అనుచరులు ఆయన కాన్వాయ్‌లకు వైసీపీ స్టిక్కర్లు తొలగించి.. తెలుగుదేశం స్టిక్కర్లు అతికించారు. పార్టీలో చేరిన తర్వాత.. ఆలూరు టికెట్ ఇవ్వాలని ఆయన అధిష్టానానికి కోరినట్లు తెలుస్తోంది. ఆలూరులో ఆశావహులు ఎక్కువగా ఉండటంతో… మొదటి జాబితాలో అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ అభ్యర్థి విరుపాక్షికి పోటీగా తనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానాన్ని జయరాం కోరినట్లు సమాచారం. ఆలూరు సీటు ఇవ్వని పక్షంలో.. గుంతకల్లు సీటును కోరగా దానిపై అధిష్ఠానం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

జయహో బీసీ కార్యక్రమానికి జయరాం హాజరుకానున్నారు. అక్కడే చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అసమ్మతి నేతలు… తెలుగుదేశం వైపు చూస్తున్నారు. తమ సామాజికవర్గం ఎక్కువగా ఉన్నందున.. తనకే సీటు ఇవ్వాలని జయరాం కోరినా.. వైసీపీ అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు.

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×